నాగచైతన్యకు మరో వివాహం..పెళ్లి కూతురు ఎవరంటే...?
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాటలు కూడా పూర్తి అయినట్లు చెప్తున్నారు. అయితే, దీనిపై అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ ఎక్కడా నోరు విప్పటం లేదు.

అక్కినేని హీరో నాగచైతన్య, సమంత ప్రేమ వివాహం మనస్పర్థలు వచ్చి విడాకులు తో ముగిసింది. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటూ వరుస చిత్రాల్లో చేస్తున్నారు. ఈ క్రమంలో మీడియా లో సమంత అయితే నాగచైతన్య, ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని అని అటు శోభితా ధూళిపాల ఇటు నాగచైతన్య కొట్టి పారేశారు. సరే అనుకుంటే...ఇప్పుడు నాగచైతన్య సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇవ్వబోతున్నట్టు మళ్లీ బాలీవుడ్ వెబ్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి.
తాజాగా నాగ చైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున ఇప్పటికే అమ్మాయిని ఫిక్స్ చేశారని సమాచారం. సినీ పరిశ్రమకు సంభందం లేని ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన మాటలు కూడా పూర్తి అయినట్లు చెప్తున్నారు. అయితే, దీనిపై అక్కినేని కుటుంబ సభ్యులు ఎవరూ ఎక్కడా నోరు విప్పటం లేదు. ఈ వార్తలో నిజా నిజాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
నాగచైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేమమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సవ్యసాచి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమమ్ పరవాలేదు అనిపించుకున్న సవ్యసాచి మాత్రం కాస్త నిరాశను కలిగించిందని చెప్పాలి. తాజా చిత్రాన్ని మత్స్యకారుల కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. జీఏ 2 పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. బన్నీ వాసు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.