Asianet News TeluguAsianet News Telugu

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' డైరక్టర్ నెక్ట్స్ ఫిక్స్,హీరో,నిర్మాత ఎవరంటే..

శ్రీవిష్ణు తాజా చిత్రం సామజవరగమన  రూ. 11.70 కోట్ల లాభాలు సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ హిట్ గా నిలిచింది.

Naga Chaitanya doing a movie under Samajavaragamana director Ram Abbaraju jsp
Author
First Published Jul 26, 2023, 9:11 AM IST

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఎండ్ లో వచ్చిన సినిమా సామజవరగమన ఎంత పెద్ద హిట్టైందో తెలిసిందే.  శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న రిలీజ్ అయ్యింది. ప్రీమియర్  షోలకే సూపర్ హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మొదలుపెట్టారు. రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాను ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో రిలీజ్ చేసారు. 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.52 కోట్ల షేర్, రూ. 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలన్నీ కలిపి 20 రోజులకు రూ. 4.68 కోట్లు కలెక్ట్ అయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 15.20 కోట్లు షేర్, రూ. 30.90 గ్రాస్ కలెక్ట్ అయింది. అంటే 20 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల క్లబ్ లోకి, వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడుకు ఆఫర్స్ వర్షం మొదలైంది.

అయితే మొదటగా ఏషియన్ ఫిల్మ్ వాళ్లు ఈ దర్శకుడు లాక్ చేసి ప్రాజెక్టు సెట్ చేసారు.  నాగ చైతన్య కు ఇప్పటికే కథ వినిపించారని, ఓకే చెప్పటంతో స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.  అలాగే ఇప్పటికే చైతు కమిటైన ..చందు మొండేటి ప్రాజెక్ట్ తో పాటే స‌మాంత‌రంగా రామ్ అబ్బ‌రాజ్ చిత్రాన్ని కూడా ప్రారంభించే అవకాసం ఉంద‌ని తెలుస్తోంది.  

రామ్‌ అబ్బరాజు ఇప్పుడు నాగ చైతన్య కోసం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేసాడని తెలుస్తోంది. సునీల్‌ నారంగ్‌ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ ప్రకటన రానుంది. అలాగే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. దూత అనే టైటిల్ తో ఈ సిరీస్ తెరకెక్కి రిలీజ్ కు రెడీ అయ్యింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios