Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్య "సవ్యసాచి" ఫస్ట్ లుక్ అదరహో..

  • అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మూవీకి టైటిల్ ఖరారు
  • మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.4కు "సవ్యసాచి" అనే టైటిల్
  • హీరో కేరక్టర్ పవర్ ఫుల్ కాబట్టే సవ్యసాచి అనే టైటిల్ పెట్టామన్న నిర్మాత
naga chaitanya chandu mondeti movie first look launched

మహాభారతంలో అర్జునుడికి సవ్యసాచి అనే పేరుంది. అంటే ఒకేసారి రెండు చేతులతో ఆయుధాలు సంధించగల వాడని అర్థం. ఇప్పుడు అదే కోవలో.. రెండు చేతుల్లో ఆయుధాలు సంధిస్తూ వుండే కటౌట్ తో... నాగచైతన్య కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. 

 

తాజాగా అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.4కు "సవ్యసాచి" అనే టైటిల్ ను నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రీలుక్ పోస్టర్ మరియు టైటిల్ ను నేడు విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "చందు మొండేటి రాసిన సూపర్బ్ హీరో క్యారెక్టరైజేషన్ కు "సవ్యసాచి" అనేది యాప్ట్ టైటిల్. "ప్రేమమ్" లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి.హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సవ్యసాచి" తెరకెక్కనుంది. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్న సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios