చైతూ తన నెక్ట్స్ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో ఉంటుంది. `కార్తికేయ2` తర్వాత చందూమొండేటి చేస్తున్న సినిమా ఇది. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయ్యింది. గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్నాడు. అంతేకాదు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కథ, టైటిల్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య ఇటీవల `కస్టడీ` చిత్రంతో వచ్చారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందించిన ఈ సినిమా ఘోరంగా పరాజయం చెందింది. ఇది తెలుగులో పది కోట్ల షేర్ కూడా వసూలు చేయలేకపోయింది. అంతకు ముందు `థ్యాంక్యూ` కూడా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో నాగచైతన్యపై ఇప్పుడు పెద్ద సాహసమే చేస్తున్నారు.
చైతూ తన నెక్ట్స్ సినిమా చందూ మొండేటి దర్శకత్వంలో ఉంటుంది. `కార్తికేయ2` తర్వాత చందూమొండేటి చేస్తున్న సినిమా ఇది. స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ అయ్యింది. గీతా ఆర్ట్స్ లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. అయితే దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారట. కథ డిమాండ్ మేరకు భారీ బడ్జెట్ కూడా అవుతుందని తెలుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి ఆరవై డెబ్బై కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. చైతూ మార్కెట్‌ని మించి రిస్క్ చేస్తున్నారట. అయితే కథ ఆ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తుంది. దీంతో రిస్క్ అయినా చేసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ముందుకొచ్చినట్టు సమాచారం.
ఈ నెలలోనే ఈ సినిమా అఫీషియల్‌గా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన కథ, టైటిల్ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది శ్రీకాకుళం బేస్డ్ గా సాగే సినిమా అని, మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరించేలా ఉంటుందట. ఇందులో చైతూ మత్య్సకారుడిగా కనిపిస్తాడట. శ్రీకాకుళంతోపాటు గుజరాత్ నేపథ్యంలోనూ కథ రన్ అవుతుందని, కొన్ని పాకిస్తాన్ బార్డర్లో సాగుతాయనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ అని తెలుస్తుంది. పూర్తి లవ్ స్టోరీగా కాకుండా లవ్‌కి ఎమోషన్స్, యాక్షన్ జోడించి లవ్, ఎమోషనల్ యాక్షన్ ఎంటరటైనర్‌గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
దీనితోపాటు చైతూ, చందూమొండేటి సినిమా టైటిల్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనికి `తండెల్` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. శ్రీకాకుళంలో మత్య్సకారులను `తండెల్` అని పిలుస్తారట. స్థానికంగా పాపులర్ అయినా ఈ పదాన్నే టైటిల్ గా పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రారంభానికి ముందే నాగచైతన్య కొత్త సినిమా హాట్ టాపిక్ అవుతుంది. ఆసక్తిని పెంచుతుండటం విశేషం.
