సోషల్ మీడియా ద్వారా యుఎస్ ఆడియన్స్ నుంచి లవ్ స్టోరీ చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది. చై, సాయి పల్లవి నటన బావుందని అంటున్నారు. స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ నీట్ గా ప్రజెంట్ చేశారని అంటున్నారు.

చాలా కాలం తర్వాత టాలీవుడ్ నుంచి గ్రాండ్ గా, కంప్లీట్ పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతున్న చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. పాండమిక్, థియేటర్ సమస్యలు వంటి అడ్డంకుల్ని దాటుకుని విడుదలవుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఇప్పటికే యూఎస్ వ్యాప్తంగా ప్రీమియర్ షోల సందడి మొదలయింది. సోషల్ మీడియా ద్వారా యుఎస్ ఆడియన్స్ నుంచి లవ్ స్టోరీ చిత్రానికి రెస్పాన్స్ వస్తోంది. చై, సాయి పల్లవి నటన బావుందని అంటున్నారు. స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ నీట్ గా ప్రజెంట్ చేశారని అంటున్నారు. క్లైమాక్స్ హెవీగా ఉన్నట్లు చెబుతున్నారు. 

Scroll to load tweet…

శేఖర్ కమ్ముల రచన అద్భుతంగా ఉంది. ప్రీ క్లైమాక్స్ వరకు మూవీ చాలా బావుంది. క్లైమాక్స్ ని ఇంకాస్త బాగా హ్యాండిల్ చేయాల్సింది. ఓవరాల్ గా గుడ్ ఫిల్మ్. 

Scroll to load tweet…

ఫస్ట్ హాఫ్ ముగిసింది. స్లోగా మొదలై అలా అలా సాగిపోతుంది. డీసెంట్ వాచ్..తోప్ అయితే కాదు. బీజియం బావుంది. 

Scroll to load tweet…

లవ్ స్టోరీ సంగీతం బావుంది. నటీనటుల నటన ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బావున్నాయి. ఇవి పక్కన పెడితే మిగిలిన కథ ప్రిడిక్టబుల్ గా ఉంది. ఎమోషనల్ డెప్త్ లేదు. 

Scroll to load tweet…

లవ్ స్టోరీ చిత్రం చూశాను. క్లాసీగా అద్భుతంగా ఉంది. సాయి పల్లవి మామూలు అమ్మాయి కాదు. నాగ చైతన్య కూడా అంతే బాగా నటించాడు. 

Scroll to load tweet…

లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ హాఫ్ బావుంది. క్లైమాక్స్ హెవీగా ఉంది. 

Scroll to load tweet…

బాగుంది కాకపోతే కొంచెం స్లో. లీడ్ పై ఈ చిత్రానికి బిగ్ ప్లస్.

Scroll to load tweet…

ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది.నాగ చైతన్య తన క్లాస్ తో మాస్ చూపించే చిత్రం.