బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా ఆడియెన్స్ ని మెప్పిస్తేనే ఏ హీరో అయినా సక్సెస్ అవుతాడు. ఈ విషయం గురించి అందరికి తెలిసిందే. అయితే కుర్ర హీరోలకు ఎక్కువగా మాస్ ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని ఉంటుంది. యాక్షన్ కథలోస్తే ఏ మాత్రం నో చెప్పరు. గత కొన్నేళ్లుగా ఆ స్టార్ డమ్ కోసం చైతు గట్టిగా ట్రై చేస్తున్నాడు. 

కానీ చైతు లవ్అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతోనే ఎక్కువగా సక్సెస్ అందుకుంటున్నాడు. మధ్యలో యాక్షన్ ని ఎంతగా ట్రై చేసిన అతను సక్సెస్ అందుకోలేకపోయాడు. కెరీర్ లో ఈ హీరోకి 100% లవ్ - ప్రేమమ్ సినిమాలు మంచి బిజినెస్ సెట్ చేశాయి. గత ఏడాది  రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక ఆ వెంటనే యుద్ధం శరణం ఊహించని అపజయాన్ని ఇచ్చింది. 

ఆ సినిమా చైతు కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. గతంలో చేసిన దడ -బెజవాడ - ఆటో నగర్ సూర్య వంటి మాస్ అండ్ యాక్షన్ సినిమాలు ఏ మాత్రం సక్సెస్ అందుకోలేదు. మధ్యలో సునీల్ తో చేసిన తడాఖా పరవాలేధనిపించింది. ఇకపోతే నెక్స్ట్ సవ్యసాచి అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో కొత్త తరహాలో ప్రయోగం చేశాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై కొంత ఆసక్తి నెలకొంది. 

నవంబర్ 2న రానున్న ఈ సినిమాపై నిర్మాతలు హీరో మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు చేశారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని చెప్పవచ్చు. యాక్షన్ హీరోగా తనకంటూ పోక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కష్టపడుతున్న చైతుకి సవ్యసాచిపై నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్లాప్ అయితే చైతూ కెరీర్ కు యాక్షన్ సినిమాల డేంజర్ ఉందనే టాక్ వైరల్ అయ్యే అవకాశం ఉండవచ్చు. చూడాలి మరి ఏమవుతుందో..