సామ్ పెళ్లికి ముందే చెప్పేసింది: నాగచైతన్య

naga chaitanya about samantha
Highlights

పెళ్లైన తరువాత ఈ జంట ఏప్రిల్ లో న్యూయార్క్ లో 'ఏ మాయ చేసావె' షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ముందే అనుకొని అక్కడకి వెళ్లారా..? అనే ప్రశ్నకు సమాధానంగా చైతు.. ''పెళ్లికి ముందే సామ్.. పెళ్లైన తరువాత అక్కడకి వెళ్లాలని'' చెప్పిందని అందుకే వెళ్లామని చైతు తెలిపారు

సుశాంత్ హీరోగా నటించిన 'చిలసౌ' సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు. మంచి సినిమాలు తమ బ్యానర్ లో చేయాలని అనుకుంటున్నట్లు.. బయట హీరోలతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తామని చెబుతున్నాడు అక్కినేని నాగచైతన్య. మరిన్ని విషయాలు చెబుతూ..

''సమంతకు రాహులు రవీంద్రన్ మంచి ఫ్రెండ్. 'చిలసౌ' సినిమా కథ మాకు ముందుగానే చెప్పాడు. బాగా నచ్చింది. కానీ సుశాంత్ తో సినిమా చేయబోతున్నాడనే విషయం నాకు అప్పటికి తెలియదు. సుశాంత్ వచ్చి కథ ఎలా ఉందని అడిగాడు. తప్పకుండా చెయ్ అని చెప్పాను. సినిమా మొత్తం పూర్తయిన తరువాత చూసి ఇంప్రెస్ అయ్యాను. అదే విషయాన్ని నాన్న(నాగార్జున)కు చెబితే ఆయన కూడా చూసి మన బ్యానర్ లోనే విడుదల చేద్దామని చెప్పారు. రాహుల్ కి డైరెక్టర్ గా ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా చేశాడు. నెల రోజుల్లో తక్కువ బడ్జెట్ లో క్వాలిటీతో  సినిమా చేయడం మాములు విషయం కాదు. అతడి తదుపరి సినిమాలు మా బ్యానర్ లో చేయాలని అడ్వాన్సులు కూడా ఇచ్చాం'' అని వెల్లడించాడు.

ఇక సామ్ సినిమాలు మానేస్తుందనే విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమె నాలుగైదు కథలు వింటుందని త్వరలోనే ప్రకటిస్తుందేమోనని అన్నాడు. బహుసా కొద్దిరోజులు బ్రేక్ తీసుకుంటుందేమో కానీ సినిమాలు మాత్రం మానదని అన్నారు. పెళ్లైన తరువాత ఈ జంట ఏప్రిల్ లో న్యూయార్క్ లో 'ఏ మాయ చేసావె' షూటింగ్ స్పాట్ కు వెళ్లారు. ముందే అనుకొని అక్కడకి వెళ్లారా..? అనే ప్రశ్నకు సమాధానంగా చైతు.. ''పెళ్లికి ముందే సామ్.. పెళ్లైన తరువాత అక్కడకి వెళ్లాలని'' చెప్పిందని అందుకే వెళ్లామని చైతు తెలిపారు. 
 

loader