నిర్మాతగా ఒకప్పుడు బిజీగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు.. ఆ తర్వాత అనుకోని నష్టాల కారణంగా నిర్మాణ రంగానికి దూరమయ్యారు. అయితే బుల్లితెరలో పలు షోలకు జడ్జిగా హల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన పలు అంశాలపై సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

అయితే అవి కాంట్రవర్సీలుగా మారుతూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో సినీ, రాజకీయ, సమకాలీన అంశాలున్నాయి. తాజాగా ఒక హిందూ పండిట్ హత్యపై నాగబాబు ఘాటుగా స్పందించారు.

ఆ ట్వీట్‌లో ‘‘ నాకు నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు.పరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా.చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు.ఎక్కడో కాశ్మీరీ పండిట్,మనచుట్టం కాదు మన స్టేట్ కాదు..ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియా లో కూడా స్పందించారు.

కానీ ఇది ఇండియా కదా ఈ సో కాల్డ్ మీడియా, సెక్యూలరిస్టులు స్పందించక్కరలేదు. కనీసం హిందువులకి ,హిందు సంస్థల కయినా బాధ్యత ఉండాలి కదా. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది.

మొన్న కొందరు సాధువులని చంపేశారు, ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని కవర్ చెయ్యని హిందువుల హత్యలు ఎన్నో..అజయ్ హత్యకి కారకులని అర్జంటుగా పట్టుకొని వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.

హిందూ మతం, హిందువుల నమ్మకాలు ,హిందువుల సంస్కృతి,ఇలాగే నాశనము అయ్యేవరకు అందరం ఇలాగే ఉందాం. నాకు తెలిసి హిందు దేశం లో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్.ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తులు పాలనలో నలిగి పోయాం,బ్రిటిష్ పాలన లో నలిగిపోయాం,స్వతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం.

ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానం గా చూసే ఒక పార్టీ పాలన లో ఉన్నాం,కానీ వీళ్లు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నట్లు గా ఉందంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అన్ని మతాల వారు సమానంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ లాగా ఉండాలని జరిగిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.