మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ లిస్ట్ లో చేరిపోయిన దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తయినా మరో సినిమానుస్టార్ట్ చేయలేదు. వైజయంతి ప్రొడక్షన్ లో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మెగాస్టార్ ను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయనున్నట్లు టాక్ కూడా వచ్చింది. 

మరి ఆ ప్లాన్ ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో తెలియదు గాని ఇప్పుడైతే నాగ అశ్విన్ ఒక కాన్సెప్ట్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టినట్లు వైజయంతి నుంచి అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ వచ్చింది. అదే విధంగా పెద్ద సినిమాను నిర్మించనున్నట్లు చెబుతూ విజువల్ ఆర్టిస్ట్ - డిజైనర్స్ - రైటార్స్ వంటి విభాగాల్లో కొత్త వారికీ అవకాశం ఇవ్వనున్నట్లు ఒక నోట్ రిలీజ్ చేశారు.

 

ఆసక్తి ఉన్నవారు vymtalent@gmail.com ద్వారా టచ్ లో ఉండాలని పేర్కొన్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేయాలనీ దర్శకుడు నాగ అశ్విన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వీలైనంత వరకు స్టార్ యాక్టర్స్ తో సినిమాను తెరకెక్కించాలని వైజయంతి ప్రొడక్షన్ ప్రయత్నాలు చేస్తోంది.