సినిమా తీయటం ఒకెత్తు..ఆ సినిమాని నీట్ గా ప్రమోట్ చేసి , సరైన రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం మరొక ఎత్తు. ఇందుకోసం టీమ్ అంతా రకరకాల చర్చలు జరుపుతూంటారు. ట్రేడ్ వర్గాలను సంప్రదిస్తూంటారు. ఎందుకంటే రిలీజ్ డేట్ ని, థియోటర్స్ ని  బట్టి కూడా సినిమాలు రెవిన్యూ జనరేట్ అవుతూంటుంది.  దాదాపు గా ఒక పెద్ద సినిమాకు మరో పెద్ద సినిమా పోటీ కాకుండా చూస్తూంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు లెక్కలు తప్పుతూంటాయి. ఇప్పుడు నాని, నాని ల మధ్య అలాంటి చిత్రమైన పోటీ ఏర్పడటం ట్రేడ్ వర్గాలను కలవరపరుస్తోంది. 

తాజాగా నాని చిత్రం గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.  మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’ ఆగష్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  నిర్మాతలు మాట్లాడుతూ.. ‘మా బేనర్‌లో చేస్తున్న మరో విభిన్న చిత్రం 'నాని గ్యాంగ్ లీడర్'. 14 నుండి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. జూన్ 30కి టోటల్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఆగష్టు 30న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం'' అన్నారు. 

 అయితే నాగార్జున తన తాజా చిత్రం మన్మధుడు 2 ని సైతం ఆగస్ట్ 29న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ రోజు నాగార్జున పుట్టిన రోజు కావటంతో సినిమా రిలీజ్ ని అప్పుడు పెట్టుకున్నారు. ఈ విషయం ముందే బయిటకు వచ్చింది. మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఈ విషయం పట్టించుకున్నారో లేదో కానీ గ్యాంగ్ లీడర్ టీమ్ తమ రిలీజ్ డేట్ ని ప్రకటించింది.

 మన్మధుడు రిలీజ్ అయిన ఒక రోజు తర్వాత గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవుతూండటంతో ఖచ్చితంతా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపెడుతుందంటున్నారు. అలాగే ఈ రెండు సినిమాలు థియోటర్స్ పంచుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయిర్ నాగార్జున, నాని ఇద్దరు కలిసి నటించిన దేవదాసు చిత్రం రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఒకరికొకరు పోటీ పడుతున్నారు.