Asianet News TeluguAsianet News Telugu

‘కల్కి 2898 ఏడీ’ విషయంలో ఇలా జాగ్రత్త పడుతున్న నాగ్ అశ్విన్.. ప్రశంసిస్తున్న ఫ్యాన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. భారీ బడ్జెట్ తో తారాస్థాయి అంచనాలతో రూపుదిద్దుకుంటోంది. అయితే సినిమా విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్తగా ఉండటం అభిమానుల నుంచి ప్రశంసల జల్లు కురిపిస్తోంది. 
 

Nag Ashwin Taking fans opinion on Kalki 2898 Ad movie Updates NSK
Author
First Published Jul 31, 2023, 9:04 PM IST | Last Updated Jul 31, 2023, 9:04 PM IST

‘మహానటి’తో తన దర్శక ప్రతిభను చాటుకున్న నాగ్ అశ్విన్ (Nag Ashwin)  ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone)  జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీ దత్ రూ.500 కోట్లకు పైగా వెచ్చించి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 

కాగా, కేవలం నాలుగు సినిమాలు చేసి తన టాలెంట్ ను నిరూపించుకున్న దర్శకుడు నాగ్ అశ్మిన్ ‘కల్కి 2898 ఏడీ’తో భారీ సాహసమే చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా ట్రెండ్ సాగుతున్న తరుణంలో ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈక్రమంలో Kalki 2898 AD విషయంలో నాగ్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ విషయంలో ఫ్యాన్స్ నుంచి ఎలాంటి అభిప్రాయాలను తీసుకోలేదు యూనిట్. పైగా నాసిరకంగా వీఎఫ్ ఎక్స్ తో అప్డేట్స్ ను వదిలారు. ఏడాది సమయం తీసుకొని వదిలిన అవుట్ పుట్ కూడా మెప్పించలేకపోయింది. 

దీంతో ‘సలార్’, ‘కల్కి’పైనే డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో రీసెంట్ గా ‘కల్కి’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై కొద్దిపాటిగా విమర్శలను అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన గ్లింప్స్ మాత్రం దుమ్ములేపింది. హాలీవుడ్ రేంజ్ లో మేకింగ్, టేకింగ్ ఉండటంతో విమర్శలన్నీ తుడిచిపెట్టుకోకుపోయాయి. భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, నాగ్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ పై ఫ్యాన్స్ నుంచి వస్తున్న అభిప్రాయాలను నోట్ చేసుకుంటున్నారు. వెంటనే సరిచేస్తున్నారు కూడా. మేకర్స్  కూడా ఫస్ట్ గ్లింప్స్ పై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఫ్యాన్స్ ఓపినియన్ ఏంటని అడుగుతున్నారు. 

ఈ క్రమంలో నాగ్ అశ్విన్ అభిమానుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను నోట్ చేసుకుంటున్న ఓ ఫొటోను షేర్ చేసింది. ‘టీజర్ వీఎఫ్ఎక్స్  రివ్యూస్’ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఫ్యాన్స్, సినీ ప్రియుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ్ చేస్తున్న తీసుకుంటున్న జాగ్రత్తలను, అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే సినిమాను తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. ఈమేరకు ఫ్యాన్స్ ‘థ్యాంక్స్ నాగ్ అశ్మిన్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్ సూపర్ హీరోగా అలరించబోతున్నారు. గ్లింప్స్ తో భారీ అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది జనవరి 12 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా షెడ్యూల్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios