రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నాయనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

 'మహానటి' దర్శకుడు నాగ అశ్విన్ ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితులను తెలియచేస్తూ రెండు వారాల పాటు అందరూ పర్సనల్ లాక్ డౌన్ పాటిస్తే మంచిదని.. దీని వల్ల డాక్టర్లకి కాస్త విశ్రాంతి దొరుకుతుందని ట్విట్టర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు.

Scroll to load tweet…

 ‘లాక్‌డౌన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా.. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్‌డౌన్‌ పాటిద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు లాక్‌డౌన్‌ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి వెళ్లి ఆసుపత్రులను చూసి రండి. అలాగే గడిచిన నెల రోజుల నుంచి వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి, తప్పనిసరిగా మనందరం వ్యాక్సిన్‌ వేయించుకుందాం. వైద్యులకు కొంత ఉపశమనం అందిద్దాం’ అని నాగ్‌అశ్విన్‌ ట్వీట్‌ చేశారు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా దీపికా పదుకొణె నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది.