దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల పోరుపై ఉత్కంఠ నెలకొంది. పాండవర్ జట్టు, స్వామి శంకర్ దాస్ జట్టులు వాగ్వాదానికి దిగాయి. నడిగర్ సంఘం ఎన్నికలను నిలిపివేయాలని తమిళనాడులో ఓ అధికారి మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై పాండవర్ జట్టు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం నాడు ఈ రిట్ పిటిషన్ పై విచారణ జరపగా.. అనుకున్న ప్రకారం ఈ నెల 23వ తేదీన ఎన్నికలు జరిగేలా తీర్పు వెల్లడించింది.

అయితే ఎన్నికలు ముగిసిన తరువాత ఓట్ల లెక్కింపు జరపరాదని షరతు విధించింది. కోర్టు ఆదేశాలతో పాండవర్ జట్టు హర్షం వ్యక్తం చేసింది.