ఎలక్షన్స్ తో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించే తమిళనాడు మరోసారి అన్ని సినిమా ఇండస్ట్రీలను ఎట్రాక్ట్ చేస్తోంది. నేడు జరుగుతున్న కోలీవుడ్ నడిఘర్ సంఘం ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. గెలిచేదెవరో గాని పోరు మాత్రం ఎన్నికల హీట్ ని గట్టిగానే పెంచుతోంది. 

సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు పోలీసులు బారి భద్రతను ఏర్పాటు  చేశారు. విశాల్ - భాగ్యరాజ్ ప్యానెళ్ల మధ్య రసవత్తర పోరు నెలకొంది. మొత్తం 3175 ఓట్లు ఉండగా రిజల్ట్స్ ఏ విధంగా వస్తుందనేది ఎంతో ఉత్కంఠంగా మారింది. 

గత ఎన్నికల్లో విశాల్ కు మద్దతుగా నిలిచిన పలువురు సినీ ప్రముఖులు ఈ సారి అతనికి వ్యతిరేఖంగా కామెంట్ చేస్తున్నారు. దీంతో మరోసారి విశాల్ అధ్యక్ష్య పదవిని అందుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.