ఈ నెల జూన్ 23న జరగాల్సిన తమిళ నడిఘర్ సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టు వెల్లడించింది. దానికి కారణమేంటంటే.. ముందుగా ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజ్ లో నిర్వహించాలని ప్లాన్ చేశారు.

కానీ అక్కడ నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యల కారణంగా పబ్లిక్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుందని భావించిన కోర్టు ఎన్నికల వెన్యూ మార్చాలని సూచించింది. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 

ఇక ప్యానెల్స్ విషయానికొస్తే.. విశాల్ ప్యానెల్, భాగ్యరాజ్ ప్యానెల్ ఒకరినొకరు దూషించుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు. తమిళ వ్యక్తి కాని విశాల్ నడిగర్ సంఘంలో ఉండడానికి వీల్లేదని అతడిని నడిగర్ సంఘం నుండి బయటకి పంపేయాలని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు భాగ్యరాజ్.

మరోపక్క వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా విశాల్ పై మండిపడుతోంది. మరి ఈసారి ఎన్నికల్లో ఎవరి ప్యానెల్ గెలుస్తుందో చూడాలి!