Asianet News TeluguAsianet News Telugu

‘బింబిసార’ను థియేటర్ లో చూసిన బాలయ్య.. నందమూరి కళ్యాణ్ రామ్, యూనిట్ పై ప్రశంసలు..

ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’ (Bimbisara) థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఆడియెన్స్ నుంచి బ్రహ్మండమైన స్పందన లభిస్తుండగా తాజాగా నందమూరి నటసింహం బాలయ్య ప్రశంసల వర్షం కురిపించారు.
 

Nadamuri Balkrishna Watched Bimbisara movie in Theatre, Apreciations on Kalyan Ram and Team
Author
Hyderabad, First Published Aug 13, 2022, 6:22 PM IST

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) తాజాగా నటించిన ఫాంటసీ ఫిల్మ్ ‘బింబిసార’. ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఫాంటసీ, టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ను దర్శకుడు వశిష్ఠ సరికొత్తగా చూపించడం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుండగా.. ఇటు సినీ తారలు కూడా ఈ మ్యాజిక్ ను ప్రశంసిస్తున్నారు. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర యూనిట్ ను అభినందించగా.. తాజాగా నందమూరి నటసింహం, సీనియర్ నటుడు బాలయ్య (Balakrishna) కూడా  ప్రశంసల వర్షం కురిపించారు. కళ్యాణ్ రామ్ ను, మూవీ యూనిట్ ను ప్రత్యేకంగా అభినందించారు.

తాజాగా బాలయ్య  ‘బింబిసార’ను థియేటర్ లో ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా మూవీపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఎక్కడా తగ్గకుండా చూపించారని దర్శకుడి ప్రతిభను మెచ్చుకున్నారు. తొలిసారిగా చక్రవర్తి పాత్రను పోషించిన నందమూరి కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారనని అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. బాలయ్యతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ఠ కూడా సినిమాను తిలకించారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR)కూడా చిత్రాన్ని చూసి తన రివ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బాలయ్య కూడా సినిమా పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో యూనిట్ హ్యాపీగా ఫీలవుతోంది.

‘అఖండ’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న బాలయ్య  ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. సినిమా సినిమాకు జోరును పెంచుతున్న నందమూరి నటసింహం.. వచ్చే చిత్రాలపైనా భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ‘NBK107’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ‘NBK108’లోనూ నటించనున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మున్ముందు రానున్నాయి.  

ఇక ‘బింబిసార’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి నెలకొల్పింది. తొలిరోజు నుంచి ఇప్పటి వరకు అదే జోరును కంటిన్యూ చేస్తోంది. ఆడియెన్స్ ను ఫిదా చేయడంతో పాటు.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి మూడు రోజుల్లోనే చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల బాట పట్టింది. ఈ చిత్రాన్ని మొత్తం నాలుగు భాగాలుగా రూపొందించనున్నారు. అందులో మొదటి భాగాన్ని ‘బింబిసార’గా విడుదల చేశారు. తదుపరి పార్టులను త్వరలోనే తెరకెక్కించనున్నారు. 

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త  మీనన్ అదిరిపోయే పెర్ఫామెన్స్ ను అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి హరిక్రిష్ణ కే నిర్మాతగా వ్యవహరించారు. నటుడు ప్రకాష్ రాజ్,  శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటించారు. రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర ఆయా పాత్రను పోషించారు. ఎంఎం కీరవాణీ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

Follow Us:
Download App:
  • android
  • ios