నేచురల్ స్టార్ నాని నటించిన ఊర మాస్ మూవీ దసరా. థియేటర్లను దడదడలాడించిన ఈమూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ కు డేట్ ను లాక్ చేసుకుంది. మరి బుల్లితెరపై దసరా పండగ ఎప్పుడంటే..? 

నేచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా దసరా. శ్రీకాంత్ ఒదేల దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈసినిమా.. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే బాక్సాఫీస్ పై కలెక్షన్ల వర్షం కురిపించింది. నాని ఊర మాస్ లుక్ లో..అంతకు మించిన పెర్ఫామెన్స్ తో.. కీర్తి సురేష్ అచ్చమైన పల్లెటూరి నాటు పిల్లగా నటించిన ఈసినిమా ప్రేక్షకులకుపిచ్చి పిచ్చిగా నచ్చింది. దాంతో దసరాకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. అందులోనూ.. నాని ఫస్ట్ టైమ్ ఈసినిమాతో పాన్ ఇండియాను టచ్ చేశాడు. హిందీలో కూడా ఈమూవీ అదరగొట్టింది. ఇక థియేటర్లలో దుమ్ము రేపిన ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

దసరా సినిమా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యింది. ప్రముఖ ఓటీటీ సంస్థ Netflix దసరా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నారు. ఇందుకోసం ఏకంగా 22 కోట్లతో డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 27న దసరా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు సమాచారం. అంతే కాదు హిందీ వెర్షన్ మూవీ మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. ఈ స్ట్రీమింగ్ డేట్ పై నెట్ ఫ్లిక్స్ నుంచి.. సోషల్ మీడియాలో కొన్ని లీకేజ్ లు కనిపిస్తున్నాయి.

నాని కేరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా దసరా నిలిచింది. డెబ్యూ దర్శకుడితో నాని ఈ ఘనతను సాధించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. ఈసినిమా సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ప్రశంసలు కురిపించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లాంటివారు సినిమా చూసి ప్రశంసలతో ముంచెత్తారు. శ్యామ్ సింగరాయ్ తరువాత హిట్ కోసం.. చూస్తున్న నానికి దసరా సాలిడ్ హిట్ ను అందించింది. 

ఇక శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ ఈసినిమాను నిర్మించగా.. సంతోష్ నారాయణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక నాని తన 30వ సినిమాపై ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేేట్ ను కూడా విడుదల చేశారు. 2023 డిసెంబర్ 21న విడుదల కానుంది.