Naa SaamiRanga OTT Date: `నా సామిరంగ` ఓటీటీలో వచ్చే డేట్..
నాగార్జున ఈ సంక్రాంతికి `నా సామి రంగ`తో హిట్ కొట్టాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయనకు సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఎందులో, ఎప్పుడు వస్తుందంటే..
అక్కినేని నాగార్జున ఈ సంక్రాంతికి హిట్ కొట్టాడు. `నా సామిరంగ` అంటూ సూపర్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయనకు సక్సెస్ దక్కింది. నాగార్జునకి `సోగ్గాడే చిన్న నాయన` తర్వాత సక్సెస్ లేదు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చింది. మళ్లీ ఇప్పుడు `నా సామిరంగ`తో విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ సుమారు యాభై కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. బిజినెస్ కేవలం 18కోట్లే కావడంతో ఈజీగా బయటపడ్డారు. పైగా సంక్రాంతి కావడంతో సీజన్‌లో కొట్టేశాడు నాగ్. మొత్తానికి హిట్ ట్రాక్ ఎక్కాడు.
ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ మలయాళంలో సక్సెస్ అయిన `పొరింజు మరియమ్ జోసే` చిత్రానికి రీమేక్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెలుగులో దర్శకత్వం వహించాడు. ఆయన ఈ మూవీతో దర్శకుడిగా మారారు. సంక్రాంతి పండక్కి కావాల్సిన ఎలిమెంట్లని మేళవించి రూపొందించారు. పండగ సినిమాల ఆడేసింది. మామూలుగా టైమ్‌లో వస్తే ఈ మూవీ ఈ ఫలితాన్ని సాధించలేకపోయేది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. థియేటర్లో విడుదలైన నెల రోజులకే ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. జనవరి 14న ఈ సినిమా విడుదల కాగా, ఇప్పుడు ఫిబ్రవరి 17న ఓటీటీలో స్ట్రీమింగ్ కాఉంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో `నా సామిరంగ` ప్రసారం కానుంది. హాట్ స్టార్‌తో నాగ్‌కి మంచి రిలేషన్ ఉంది. `బిగ్ బాస్` షోకి ఆయన వ్యాఖ్యాతగా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆ రిలేషన్‌తో భారీ మొత్తానికి ఓటీటీ అమ్మినట్టు తెలుస్తుంది. ఆ రకంగా నిర్మాత సేఫ్ జోన్‌లోకి వెళ్లారట.
ఇక ఈ మూవీలో నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. దీనికి ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం.