`నా సామిరంగ` డైరెక్టర్‌కి బంపర్ ఆఫర్.. ?
`నా సామిరంగ` సినిమాతో చాలా రోజుల తర్వాత నాగార్జునకి హిట్ పడింది. ఈ మూవీ సంక్రాంతికి విడుదలైన లాభాల్లోకి వెళ్తుంది. దీంతో దర్శకుడికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది.

నాగార్జున హీరోగా నటించిన `నా సామిరంగ` మూవీ సంక్రాంతికి విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. ఇప్పటికీ ఇది థియేటర్లలో రన్ అవుతుంది. నాగార్జునతోపాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీకి విజయ్ బిన్ని దర్శకత్వం వహించారు. ఆయన కొరియోగ్రాఫర్. ఈ మూవీకి మొదట ప్రసన్న కుమార్ బెజవాడ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్, రీమేక్ విషయంలో చోటు చేసుకున్న మనస్పర్థాల నేపథ్యంలో ఆయన్ని తప్పించి విజయ్ బిన్నీకి దర్శకత్వ పగ్గాలు అప్పగించారు నాగ్.
సంక్రాంతి కావాల్సిన అంశాలను రంగరించి పండగ సినిమాని రూపొందించారు. పల్లెటూర్లో గొడవలు, ఫన్, అమాయకత్వం, ఊర్లమధ్య గొడవలు, పెద్దమనుషుల వ్యవహారాలు, పాటలు,ఫైట్లు, ఫన్, రొమాన్స్ మేళవింపుతో ఈ మూవీని తెరకెక్కించారు. పండక్కి కావాల్సినట్టుగా తీశారు. సంక్రాంతి పండగకి విడుదల కావడంతో ఈ మూవీని ఆడియెన్స్ కూడా బాగానేఇష్టపడుతున్నారు.
ఇదిలా ఈ మూవీ కేవలం 18కోట్ల బిజినెస్ చేసింది. 32కోట్లకుపైగా డిజిటల్ రైట్స్ వచ్చాయి. నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్. ఇక తక్కువ బిజినెస్ తో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యింది. 18కోట్ల షేర్ దాటింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుంది. తక్కువ బిజినెస్ కావడంతో ఈజీగానే గెటాన్ అయ్యింది. దీంతో అటు నాగార్జున, ఇటు నిర్మాతలు సేఫ్‌లో ఉన్నారు. హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత నాగ్ కి హిట్ పడింది. దీంతో ఆయన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
ఈ ఆనందంలో చిత్ర దర్శకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మరో దర్శకత్వ ఛాన్స్ ఇచ్చారు. తన బ్యానర్‌లో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోలో ఓ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దర్శకుడు విజయ్ బిన్నికి ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి మరో కొరియోగ్రాఫర్‌ని దర్శకుడిని చేసిన ఘనత నాగార్జునకి దక్కుతుంది. ఆయన చాలా మందిని తన బ్యానర్ ద్వారా దర్శకులుగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అందులో లారెన్స్ కూడా ఉన్నారు.