నా పేరు సూర్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్... రికవరీ కష్టమే

Naa peru surya first week collections
Highlights

నా పేరు సూర్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్.

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా'. భారీ అంచనాలతో విడుదలైన ఈ యాక్షన్ ఫిల్మ్ బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తి చేసుకుంది. టాలీవుడ్లో ఇటీవల విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోవడంతో..... బన్నీ మూవీ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందనే ఒక హైప్ వచ్చింది. అయితే విడుదలైన తర్వాత ఆ హైప్ రీచ్ అవ్వడంలో 'నా పేరు సూర్య' విఫలమైంది.నా పేరు సూర్య' థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మారు. బాక్సాఫీసు వద్ద తొలివారం వరల్డ్ వైడ్ రూ. 44.5 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే ఇది ఊహించిన దానికంటే తక్కువే అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తొలివారం 60 నుండి 70శాతం రికవరీ అయితే బెస్ట్, అయితే ‘నా పేరు సూర్య' కేవలం 55 శాతం మాత్రమే రికవరీ చేసింది.

ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నైజాం                       -   11.10         
సీడెడ్                        -     5.85         
వైజాగ్                       -    4.52         
ఈస్ట్                         -    3.20         
వెస్ట్                         -    2.47
కృష్ణా                        -    2.32
గుంటూరు                -     3.68
టోటల్ ఏపి/నైజాం      -    34.5
యూఎస్                  -     1.90
కర్నాటక                  -    5.80
తమిల్ నాడు             -    2.25
కేరళ                        -    1.50
రెస్ట్ ఆఫ్ ఇండియా      -     1.25
టోటల్ వరల్ట్ వైడ్       -     46.5

loader