రవితేజ సినిమాను నిర్మాతలు ఆపేశారట!

mytri movie makers to stop raviteja santosh srinivas film
Highlights

ఫార్ములా బేస్డ్ సినిమాలకు ఆదరణ తగ్గడంతో సంతోష్ స్క్రిప్ట్ మీద నమ్మకం కోల్పోయిన మైత్రి మూవీ మేకర్స్ ఇక ఈ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. కానీ ఆయన బిజీగా ఉండడంతో రవితేజతో చేయాలనుకున్నాడు. 

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇలియానా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఈ నిర్మాణ సంస్థ రవితేజతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ రాయించుకున్నారు. ముందుగా శ్రీనువైట్ల సినిమాను పూర్తి చేసి ఆ తరువాత దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజతో మరో సినిమా చేయాలనుకున్నారు.

తమిళ 'తేరి' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను రూపొందించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో రవితేజ కూడా చెప్పాడు. కానీ ఆ సినిమాకు ఈ కథకు చాలా వేరియేషన్ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. ఫార్ములా బేస్డ్ సినిమాలకు ఆదరణ తగ్గడంతో సంతోష్ స్క్రిప్ట్ మీద నమ్మకం కోల్పోయిన మైత్రి మూవీ మేకర్స్ ఇక ఈ సినిమాకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. కానీ ఆయన బిజీగా ఉండడంతో రవితేజతో చేయాలనుకున్నాడు.

అన్నీ చక్కగా కుదిరాయనుకున్న సమయంలో ఇప్పుడు నిర్మాతలే సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ఆపమని చెప్పడంతో సంతోష్ శ్రీనివాస్ మరొక హీరోతో సినిమా చేయాలా..? లేక స్క్రిప్ట్ పక్కన పెట్టేయాలా అనే విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పైగా ఈ మధ్యకాలంలో రవితేజ నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తుండడంతో నిర్మాతలు కూడా రెండు సినిమాల విషయంలో పునరాలోచన చేసి రెండో సినిమా ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  

loader