Asianet News TeluguAsianet News Telugu

#Hanuman దిల్ రాజు పై మైత్రీ మూవీస్ డైరక్ట్ సెటైర్

 ఓవర్సీస్ లో అయితే హనుమాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ దాటి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ఆడియన్స్ 'హనుమాన్'కి చూపిస్తున్న ఆదరణ అంతా అంతా కాదు. 

Mythri Movies direct satire on Dil Raju with #Hanuman Box Office Benchmark jsp
Author
First Published Jan 17, 2024, 11:40 AM IST


2024 సంక్రాంతికి భాక్సాఫీస్ చాలా హంగామాగా మొదలై, సైలెంట్ గా ముగిసింది.  ఒకేసారి  నాలుగు సినిమాలు విడుదల అవ్వడంతో అసలు థియేటర్లు ఎలా సరిపోతాయి, కలెక్షన్స్ ఎలా వస్తాయి అని ఇండస్ట్రీ నిపుణుల్లో చర్చ మొదలయ్యాయి. పైగా మేకర్స్ అంతా ముందు నుంచి అనుకున్న రిలీజ్ డేట్స్ కావడంతో.. ఎవరూ వెనక్కి తగ్గ లేదు. ‘గుంటూరు కారం’లాంటి కమర్షియల్ సినిమాలకు పోటీగా ‘హనుమాన్’లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ పాన్ ఇండియా చిత్రాలు కూడా ఒకేరోజు విడుదల అయ్యింది. ఈ క్రమంలో ‘హనుమాన్’ మూవీ రిలీజ్‌పై స్పందించి  దిల్ రాజు హాట్ టాపిక్ గా మారారు. దాంతో హనుమాన్ సక్సెస్ ...దిల్ రాజు పై సక్సెస్ అన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లుపడ్డాయి. చిన్న సినిమాని తొక్కేద్దామని ప్రయత్నించారంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ నేపద్యంలో మైత్రీ వారు కూడా డైరక్ట్ గా, ఇండైరక్ట్ గా పోరాడారు.

మొత్తానికి  తేజ్ సజ్జా నటించిన హనుమాన్ సినిమా  పెద్ద హిట్టైంది.  సంక్రాంతి కలెక్షన్స్ భీబత్సంగా ఉన్నాయి. చాలా చోట్ల గుంటూరు కారం చాలా స్క్రీన్స్ కూడా.. హనుమాన్‌కి షిప్ట్ కావడం విశేషం. ఈ చిత్రానికి టిక్కెట్ల డిమాండ్ భారీగా ఉంది . దీని కారణంగా అదనపు షోలు, థియేటర్లు నిరంతరం పెరగడం విశేషం. ప్రతి రోజు గడిచేకొద్దీ పెద్ద సంఖ్యలో హనుమాన్ చూడాలని అనుకునేవారి సంఖ్య పెరగుతున్నారు. పండగ రోజుల్లో ఈ సినిమా అన్ని ఏరియాల్లో సంచలనం సృష్టిస్తోంది. హనుమాన్ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు రాబోయే రోజుల్లో బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో మైత్రీ వారు "Small film - BIG JUSTICE" అంటూ పోస్టర్ వదిలారు. చిన్న సినిమా కు పెద్ద న్యాయం జరిగింది అని అర్దం వచ్చేలా ఉన్న ఈ వాక్యం డైరక్ట్ గా దిల్ రాజుని ఉద్దేశించే అంటున్నారు. గత కొంత కాలంగా దిల్ రాజుకు, మైత్రీమూవీస్ కి మధ్య జరుగుతున్న వార్ ...ఇలా బయిటపడింది అంటున్నారు. నైజాంలో మైత్రీవారు దిల్ రాజు కు బలమైన ప్రత్యర్దిగా మారారనటంలో సందేహం లేదు.   

బాక్స్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర చిన్న సినిమాగా రిలీజ్ అయిన హానుమాన్(HanuMan Movie) అదిరిపోయే  కలెక్షన్స్ తో  దూసుకుపోతోంది. లిమిటెడ్ రిలీజ్ తోనే ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేయటం ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. ఎక్సపెక్టేషన్స్  అన్నీ మించిపోయే రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా సాలిడ్ నంబర్స్ ను నమోదు చేయటంతో సినీ లవర్స్ లో  ఇదే హాట్ టాపిక్ గా మారింది.  ఓవర్సీస్ లో అయితే హనుమాన్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్టార్ హీరోల సినిమాల కలెక్షన్స్ దాటి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ఆడియన్స్ 'హనుమాన్'కి చూపిస్తున్న ఆదరణ అంతా అంతా కాదు. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా నార్త్ అమెరికాలో ఏకంగా మూడు మిలియన్ డాలర్ల మార్క్ రీచ్ అయ్యి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో నార్త్ అమెరికాలో హైయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన టాప్ 10 మూవీస్ లో ఒకటిగా హనుమాన్ చోటు సంపాదించుకుంది. 
  
     తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ ఒక సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ మూవీ విడుదలయ్యిన మంచి టాక్ తెచ్చుకుని,  పిల్లలను ,  విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పైగా తెలుగులో మాత్రమే కాదు.. ‘హనుమాన్’ను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేసాన్నారు కాబట్టి ఇతర భాషల్లో కూడా ప్రమోషన్స్ భారీగానే జరిగింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios