నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. వీటన్నింటి తర్వాత హను రాఘవపూడితో మూవీని పట్టాలెక్కించనున్నారు ప్రభాస్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రక్క ఇప్పటికే పూర్తైన ఆదిపురుష్,సలార్ వంటి సినిమాలు తుది మెరుగులు దిద్దుకుంటూ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.సిద్ధంగా ఉంది. ఇప్పటికే కమిటై నడుస్తున్నవి కాకుండా ఇవి కాకుండా మరో మూడు ప్రాజెక్టులు పైప్ లైన్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో మూవీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ..లవర్ బోయ్ గా కనిపిస్తాడని చెప్తున్నారు.
డార్లింగ్,మిస్టర్ ఫెరఫెక్ట్ రోజుల నాటి ప్రభాస్ ని ఆవిష్కరించబోతున్నట్లు వినికిడి. అయితే పెరిగిన యాక్షన్ ఇమేజ్ కు ప్రభాస్ ..ఇంకా లవర్ బోయ్ గా కనిపిస్తే బాగుంటాడా అనేది పెద్ద ప్రశ్న. దానికి తోడు ఈ సినిమా వచ్చే నాటికి సలార్ వంటి పూర్తి యాక్షన్ సినిమాలు వచ్చేస్తాయి. అయితే ప్రభాస్ ఆలోచన వేరేగా ఉందంటున్నారు. సలార్, ప్రాజెక్టు కే వంటి సినిమాలతో పెరగబోయే హై ఇమేజ్ ను తగ్గించి క్యాజువల్ గా తనను తీసుకు రావటానికి ఇలాంటి లవ్ స్టోరీలు అవకాసం ఇస్తాయని భావిస్తున్నారట.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా.. సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ముఖ్య పాత్రలను పోషించారు. అంతేకాకుండా టీ-సిరీస్, రెట్రోపైల్స్ బ్యానర్లలో భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్ నిర్మిస్తున్నారు. తన్హాజీ ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాచేత్ పరంపరా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
