మైత్రి తో మిస్టర్ శెట్టి మూవీ, డైరక్టర్ అతనేనా? నిజం అయితే టేబుల్ ప్రాఫట్టే
టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా పేరొందిన 'మైత్రీ మూవీ మేకర్స్' నవీన్ పొలిశెట్టితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.

నవీన్ పోలీస్ శెట్టి ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. జాతిరత్నాలు తరువాత యూవీ క్రియేషన్స్ లో నటించి హ్యాట్రిక్ కొట్టిన ఈహీరో ఇప్పుడు మరో బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ లో సినిమా చేసే ఛాన్స్ కొట్టేయటం హాట్ టాపిక్ గా మారింది. నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో విజయం సాధించినందుకు మైత్రి నిర్మాతలు నవీన్ యెర్నేని,రవి శంకర్.. నవీన్ పోలిశెట్టి ని కలిసి అభినందించారు.ఈ సందర్భంగా త్వరలోనే కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాం.. ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ చూడడానికి మీరు రెడీ ఆ అంటూ మైత్రి మూవీస్ మేకర్స్ ట్వీట్ చేసింది దాంతో నవీన్ పోలిశెట్టితో మైత్రి సినిమా చేయనుందని ఫిక్స్ అయ్యిందని అర్దమైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం డైరక్టర్ ఎవరు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
— Mythri Movie Makers (@MythriOfficial) September 21, 2023
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...నవీన్ తన తదుపరి చిత్రాన్ని 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ తో చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగాయని వినపడుతోంది. తమ కాంబినేషన్ లో అయితే ఖచ్చితంగా 'జాతి రత్నాలు' ని మించిన ప్రాజెక్టు బయిటకు వస్తుందని నవీన్ నమ్ముతున్నారట. అయితే ఇంకా ప్రాజెక్టు ఖరారు కాలేదని, త్వరలో స్క్రిప్టు లాక్ చేసి, అఫీషియల్ గా ఎనౌన్స్ చేయచ్చు అంటున్నారు. మరో ప్రక్క మైత్రీ వారు..మరో రెండు కథలను సైతం నవీన్ కోసం రెడీ చేయించారని, ఒకరు సీనియర్ దర్శకుడు కాగా మరొకరు, కొత్త దర్శకుడుతో అని తెలుస్తోంది. అయితే నవీన్ ఓకే చేసిన కథకే మైత్రీవారు ఓటేస్తారు. దాంతో 'జాతి రత్నాలు' దర్శకుడుతోనే ఫైనల్ అయ్యే అవకాసం ఉంది. అదే జరిగితే మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనేది నిజం. ట్రేడ్ లో సైతం ఈ కాంబో అంటే ఖచ్చితంగా బజ్ ఓ రేంజిలో ఉంటుంది. మైత్రీ కు రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫెట్ ఉంటుంది.
ఇక గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ హవాయే నడుస్తోందనేది నిజం. ఈ బ్యానర్ లో వచ్చిన పెద్ద సినిమాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. శ్రీమంతుడు, రంగస్థలం, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్స్ ఈ బ్యానర్ నుండి వచ్చినవే. ముఖ్యంగా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమాలే కావడం విశేషం. అయితే ఈ బ్యానర్ నుండి వచ్చే చిన్న సినిమాలు మాత్రం పెద్దగా వర్కవుట్ కావటం లేదు. మీటర్, ఏమిగోస్ డిజాస్టర్ అవ్వగా.., ఖుషి ఓకే అనిపించుకుంది. అయితే నవీన్ తో మీడియం బడ్జెట్ లో సినిమా చేసి పెద్ద హిట్టు కొట్టాలన్న ఆలోచనతో మైత్రీ వారు ఈ ప్రాజెక్టు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.