సినిమా ఇండస్ట్రీలో వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ లెక్కలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నిర్మాతలు ఎన్ని ప్రయోగాలు చేసిన వారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. 

సినిమా ఇండస్ట్రీలో వాతావరణం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు సినిమా బడ్జెట్ లెక్కలు మారుతూ ఉంటాయి. ముఖ్యంగా నిర్మాతలు ఎన్ని ప్రయోగాలు చేసిన వారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే సినిమాలు డిఫరెంట్ గా ఉండాలని అనుకుంటారు. అలాగే కొంత లాభం వచ్చేలా ఉండాలని అనుకుంటారు. అసలు విషయంలోకి వస్తే ఇప్పటివరకు భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చిన ప్రముఖ బడా నిర్మాణ సంస్థ ఒకటి 'లో' బడ్జెట్ సినిమా చేయనుంది. 

ఆ బ్యానర్ మరేదో కాదు. శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ మరియు రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటి సారి చిన్న బడ్జెట్ సినిమాతో రానుంది. మినిమమ్ 100 కోట్ల బిజినెస్ తో బిజీగా ఉండే ఈ సంస్థ మొదటి సారి 15 కోట్లకు మించకుండా ఒక సినిమా చేయాలని అనుకుంటోందట. అందులో భాగంగానే కొత్త తరం యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని అనుకుంటోంది. రితేష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ పూర్తిగా నూతన నటీనటులతో ఒక ప్రయోగాత్మకమైన సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

గీత ఆర్ట్స్ కూడా భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అదే తరహాలో ఇండస్ట్రీలో మైత్రి కూడా మరో బడా నిర్మాణ సంస్థగా నిలవాలని సంస్థ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ రెండు సినిమాలను నిర్మిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా అమర్ అక్బర్ ఆంథోనితో పాటు చందు మొండేటి - నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సవ్యాసాచి సినిమాను నిర్మిస్తున్నారు.