Asianet News TeluguAsianet News Telugu

'మైత్రీ' మొత్తం ఎంత పెట్టింది...మునుగుతుందా? తేలుతుందా?

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు ఈ సారి సందడి చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలకూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కావడం విశేషం. 

Mythri Movie Makers Happy with two Veterans
Author
First Published Jan 4, 2023, 10:09 AM IST


ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏదైనా ఉందీ అంటే అది ...మైత్రీ మూవీస్ గురించే.  ఈ సంక్రాంతికి ఈ బ్యానర్ నుంచి రెండు భారీ చిత్రాలు వస్తున్నాయి. సంక్రాంతికి ఈ సారి ఇద్దరూ స్టార్ హీరోలు అమి తుమీ తేల్చుకోనున్నారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవీ నటించి వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కానున్నాయి.  ఒకే బ్యానర్ నుంచి ఒక రోజు తేడాలో రెండు భారీ సినిమాలు రిలీజ్ కు తేవటం అంటే మాటలు కాదు. కానీ మైత్రీ ఆ సాహసం చేసింది. అదే సమయంలో ఈ సాహసానికి ఏ స్దాయి ఖర్చు పెట్టింది...ఎంత రిటర్న్స్ ఉంటాయి అనేది లెక్కించాల్సిన విషయం. అందులోనూ రెండు సినిమాల్లో చేసింది సీనియర్ హీరోలే. వాళ్లిద్దరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరు యంగ్ డైరక్టర్స్ తో ఈ సినిమా లు చేసింది. రెంటింకి ఎంత ఖర్చు పెట్టారో చూస్తే...
 
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...వాల్తేరు వీర‌య్య కోసం మైత్రీ మూవీస్ దాదాపుగా రూ.140 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. వీర సింహారెడ్డి కోసం మ‌రో రూ.110 కోట్లు అయ్యింద‌ని అంటున్నారు. అంటే.. మొత్తం క‌లిపి రూ.250 కోట్లు. ప్రీ బిజినెస్ కూడా అదే స్దాయిలో జరిగిందని సమాచారం. ఇప్పటికే చాలా ఏరియాల్లో సినిమాని మంచి లాభాలకే అమ్మేశారు.  కానీ ఏ సమస్యా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సినిమాలు రెండూ పెద్ద హిట్ట‌వ్వాల్సిందే. ఈ రెండు సినిమాలూ రూ.300 కోట్లు సాధిస్తే గానీ, మైత్రీ మూవీస్ హ్యాపీగా మీసం మెలేయచ్చు. 

చిరంజీవి  `గాడ్ ఫాద‌ర్‌` తర్వాత వస్తున్న చిత్రం ఇది. అలాగే బాల‌య్య‌ అఖండ తర్వాత తెరకెక్కిన సినిమా ఇది.  ఇది సంక్రాంతి సీజ‌న్‌. ఈ సీజ‌న్‌లో పెద్ద సినిమాల‌కు మంచి ఓపినింగ్స్ ఉంటాయి. సినిమా అనుకున్న స్దాయిలో  హిట్ట‌యితే మాత్రం వ‌సూళ్ల కుంభ వృష్టే.  అందుకే  మైత్రీ మూవీస్ చాలా కూల్ గా ఉందని సమాచారం. ఓ రకంగా ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ కళకళ్ళాడుతుంది. 2023 హ్యాపీగా దూసుకెళ్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios