బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు సర్వం సిద్దం అయ్యింది. ఈ ఆదివారం నుంచే తాజా సీజన్ స్టార్ట్ కాబోతోంది. ఇక ఈక్రమంలో చివరి నిమిషం వరకూ కంటెస్టెంట్స్ విషయంలో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా తనను తీసుకుంటారని తెప్పి.. తీసేశారంటూ కామెంట్స్ చేశాడు మై విలేజ్ షో ఫేమ్ అనిల్. 


బిగ్ బాస్ తెలుగుసీజన్ 7 కు అంత సిద్దంగా ఉంది. కంటెస్టెంట్స్ ఎవరు అనేది.. ఎవరకి వారు వారి ఊహల్లో బోమ్మలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నవారిలో కొంత మంది మాత్రం హౌస్ లో కనిపించే అవకాశం 100శాతం ఉంది. గతంలో కూడా ఇలానే జరిగింది. ఇకపోతే.. బిగ్ బాస్ లోకి తీసుకుంటాము అనిచెప్పి.. చివరినిమిషంలో హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు.. ప్రతీ సీజన్ కు జరుతూనే ఉన్నాయి. ఈసారి కూడా ఇదే రిపిట్ అయ్యింది. అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తరువాత అసంతృప్తి స్వరాలు వినిపించేవి.. కాని ఈసారి స్టార్ట్ కాకముందే వినిపిస్తున్నాయి.

తాజాగా మైవ విలేజ్ షో ఫేమ్ అనిల్ తనను బిగ్ బాస్ లోకి తీసుకుంటామని చెప్పి హ్యాండిచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 99.9 పర్సంట్ పక్కా అంటూ హామీ ఇచ్చి..చివరినిమిషంలో.. పక్కన పెట్టారంటూ.. వ్యాఖ్యలు చేశారు అనిల్. అనిల్ గంగవ్వతో కలిసి మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తున్నారు. గంగవ్వ సోషల్ మీడియా సెబ్రిటీగామారడానికి వెనుక అనిల్ కృషి ఉంది. ఆయనే ఆమెను లీడ్ తీసుకుని ఈ ఛానెల్ ను నడిపించాడు. ఇక గంగవ్వ కూడా బిగ్ బాస్ లో అంతకు ముందు సీన్ లో సందడి చేసింది. ఉండలేక మధ్యలోనే బయటకు వచ్చేసింది. ఇక ఇప్పుడు అనిల్ ను బిగ్ బాస్ లోకి తీసుకుంటామని చెప్పి చివరకు పక్కన పెట్టారంటున్నాడు అనిల్.

 తాజాగా ఆయన షేర్ చేసిన వీడియోలో.. తాను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్లడం లేదని విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. అనీల్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ నుంచి నాకు కాల్ వచ్చింది.. ఇంటర్వ్యూలు కూడా అయ్యాయి. ఆ ఇన్ఫర్మేషన్‌ బయటకు వచ్చింది.. దీంతో నా అనుకున్న వాళ్లు చాలామంది బిగ్ బాస్‌కి వెళ్లమని కొందరు.. వెళ్లొద్దని మరికొందరు.. ఆలోచించుకోమని ఇంకొందరు చెప్పారు. మైవిలేజ్ షో ఫ్రెండ్స్ అయితే వెళ్లమనే చెప్పారు. గంగవ్వ కూడా వెళ్లమన్నది. మా ఫ్యామిలీలో అమ్మ అయితే నాటకాలు ఆడుకుండా ముందు బిగ్ బాస్‌కి వెళ్లు.. నాలుగు డబ్బులు సంపాదించుకుంటే అందరం హ్యాపీగా ఉండొచ్చని చెప్పింది అన్నారు. 

ఇక నా భార్య అయితే ఏకంగా ప్రోమోల వరకూ ఊహించేసుకుంది. తాను బిగ్ బాస్ హౌస్‌లోకి గెస్ట్‌గా రావడాన్ని కూడా ఊహించుకుంది. మా అత్తమ్మ వాళ్లు కూడా మా అల్లుడు బిగ్ బాస్‌కి వెళ్తున్నారని చెప్పుకున్నారు. అంటూ బాధపడ్డాడు అనిల్. అయితే నిజానికి బిగ్ బాస్ కు వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎందుకంటే నేను రాసిన స్క్రిప్ట్ రెడీగా ఉంది. నిర్మాతల కూడా సెట్ అయ్యేలా ఉన్నారు. సినిమా చేయాలి అని అనుకున్నా.. అలాంటి టైమ్ లో.. బిగ్ బాస్‌లోకి వెళ్తే.. మన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ చూపిస్తారు. అది నటుడి కెరియర్‌పై ఎఫెక్ట్ పడుతుంది అనే ఆలోచన వచ్చింది అన్నారు అనిల్. అవన్నీ చూపించిన వ్యక్తిని నటుడిగా యాక్సెప్ట్ చేస్తారా? అనే భయం నాలో ఉంది. అన్నారు అనిల్. ఇక ఆ ఆలోచన ఉన్న టైమ్ లోనే.. ఇక వెళ్ధాం.. పర్లేదు అనుకున్నాను.. కాని చివరినిమిషంలో ఇలా హ్యాండ్ ఇస్తారు అనుకోలేదు అన్నారు అనిల్.