బాలీవుడ్ నటి, ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో-ఓనర్ అయిన ప్రీతి జింటా తాజాగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకుంది. అయితే అందులో విశేషం ఏముంది అనిపించవచ్చు. అయితే ఇలా ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకోవటం ఇది ఇరవయ్యో సారి. ఈ విషాయన్ని ఆమే రివీల్ చేసింది. ఐపీఎల్ క్రీడాకారులతో బాటు అందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సురక్షిత ఆరోగ్యానికి తోడ్పడే బయో బబుల్స్ రూల్స్ ని ఈమె ఖఛ్చితంగా పాటిస్తున్నాని చెప్పింది. ప్రతి కొన్ని రోజులకొకసారి తాను ఈ టెస్ట్ చేయించుకుంటున్నానని ఓ వీడియోలో తెలిపింది. 

బహుశా ఇది 20 సారి అనుకుంటా అని పేర్కొంది. ఇలా టెస్టులు చేయించుకుని తను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయిపోయానని ప్రీతీ జింటా చమత్కరించింది. బయో బబుల్ అంటే బయటి ప్రపంచానికి దూరంగా ఎలాంటి వైరస్ లేని పరిస్థితులతో కూడిన వాతావరణమే ! అయితే ఈమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్న తీరు సరిగా లేదని నెటిజనులు అంటున్నారు. ఇదేదో తమాషా వ్యవహారంలా ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రీతి జింతా ఈ బయో బబుల్ గురించి వివరిస్తూ... ‘చాలా మంది బయో బబుల్ అంటే ఏంటని నన్ను అడుగుతున్నారు. బయో బబుల్ అంటే.. ఆరు రోజుల క్వారంటైన్, నాలుగు రోజులకోసారి కోవిడ్ టెస్టులు చేయించుకోవడం, మనకు కేటాయించిన గదికే పరిమితం కావడం. జట్టుకు కేటాయించిన రెస్టారెంట్, జిమ్, స్టేడియంను మాత్రమే ఉపయోగించడం. బీసీసీఐకి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ స్టాఫ్‌కు చాలా థ్యాంక్స్. మమ్మల్ని సేఫ్‌గా ఉంచడం కోసం, ఐపీఎల్ కొనసాగడం కోసం వీరేంతో శ్రమిస్తున్నారు’ అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు.