ఈ రోజు(గురువారం) చిరంజీవి పుట్టినరోజు జరుపుకుంటన్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మెగాస్టార్‌ కి అనేక మంది బర్త్ డే విషెష్ చెప్తున్నారు, ప్రముఖ సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ సైతం తనదైన స్టైల్ లో మ్యూజికల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ (చిరంజీవి,డీఎస్‌పీ) కాంబినేషన్‌లోని పాపులర్‌ సాంగ్‌ శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పాటతో సైరా సరసింహారెడ్డికి సూపర్‌ డూపర్‌ మ్యూజికల్‌ విషెస్‌ తెలిపారు. దీంతో మెగా అభిమానులు  లైక్‌లు, రీట్వీట్‌లతో ఫుల్ ఖుషీ అయ్యిపోయారు.

అలాగే చిరంజీవి అప్‌ కమింగ్‌ మూవీ సైరాపై స్పందిస్తూ.. సైరా ట్రైలర్‌ అదిరిపోయింది సర్‌.. ఫ్యాన్స్‌ అందరిలాగానే మేం కూడా  ఈ  మూవీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజు (గురువారం, 22) పురస్కరించుకొని, మెగా అభిమానులు బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా వేడుకలను జరుపుకున్నారు. 

చిరంజీవి హీరోగా  ప్రతిష్టాత్మకంగా వస్తున్న 151వ చిత్రం  'సైరా నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై  ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీని విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు.  ఈ క్రమంలో ఇటీవల రిలీజైన  సైరా ట్రైలర్‌ అంచనాలను భారీగా పెంచేసింది.