బాలయ్య ఫ్యాన్స్ కు భారీ అప్ డేట్ ఇవ్వబోతున్న తమన్, భగవంత్ కేసరి సినిమా నుంచి త్వరలో...?
గెట్ రెడీ బాలయ్య ఫ్యాన్స్.. మీ కోసం తమన్న మరోసారి అదరిపోయే ట్యూన్లు రెడీ చేస్తున్నాడు. త్వరలో సాలిడ్ అప్ డేట్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఆ విషయాన్ని తమన్న స్వయంగా వెల్లడించాడు.

గెట్ రెడీ బాలయ్య ఫ్యాన్స్.. మీ కోసం తమన్న మరోసారి అదరిపోయే ట్యూన్లు రెడీ చేస్తున్నాడు. త్వరలో సాలిడ్ అప్ డేట్ ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఆ విషయాన్ని తమన్న స్వయంగా వెల్లడించాడు.
అఖండ సినిమాతో బాలయ్యకు అదరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఎస్.థమన్. బాలయ్య ఫ్యాన్స్ కే కాదు.. కామన్ ఆడియన్స్ కు కూడాగూస్ బంప్స్ తెప్పించేలా.. తమన్ ఇచ్చిన మ్యూజిక్.. థియేర్టలో బాక్సులు బద్దులు చేసింది.. దాంతో బాక్సాఫీస్ కూడా షేక్ అయ్యేలా అఖండ సినిమా కలెక్షన్స్ సాధించింది. ఇక అఖండ ఎఫెక్ట్ తో..బాలయ్య తమన్ కు వరుసగా ఛాన్స్ లు ఇస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం థమన్ బాలయ్య తో భగవంత్ కేసరికి మ్యూజిక్ ఇస్తున్నాడు. అందులో భాగంగా బీజీఎం పనులపై ఫోకస్ పెట్టాడు
ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఓ స్టిల్ హల్ చల్ చేస్తోంది. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. జై బాలయ్య, హ్యాట్రిక్ అంటూ హ్యాష్ ట్యాగ్‌లను జోడించి పోస్ట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అదరగొట్టేస్తున్నాడు బాలకృష్ణ. థమన్ కంపోజిషన్‌లో సాంగ్స్ ఉండబోతుండటంతో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.
అనిల్ రావిపూడి ఈసారి బాలకృష్ణను చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ.. రాయలసీమ పౌరుషాన్ని సినిమాల్లో చూపిస్తూ.. ఫ్యాన్స్ ను అలరించే బాలయ్య.. ఈ సారి భగవంత్ కేసరిగా తెలంగాణ యాసలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నాడని గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి. ఇక ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలను తన మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్లిన థమన్ ఈ సారి కూడా ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఇక ఈమూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
రిలీజ్ డేట్ చాలా దగ్గర్లో ఉండటంతో.. మూవీ టీమో ప్రమోషన్లకు రెడీ అవుతోంది. ఈసారి భారీగా ప్రమోషన్ ఈవెంట్లు చేయాలి అని అనుకుంటున్నారట టీమ్. ఇక బాలయ్యతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దసరా టైమ్ కావడంటో.. పండగ కనిపించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నట్టు సమాచారం.