సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు సింగర్, లిరికల్ రైటర్ కూడా. మంచి ఫోటోగ్రాఫర్ కూడా అని తాజా ట్వీట్ ద్వారా నిరూపించుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్వీట్ ఒకటి వైరల్గా మారింది. "ఆకాశంలో శివుడు కనిపిస్తున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి మనల్ని గట్టెక్కించేందుకు తరలి వస్తున్నాడు" అంటూ తన కెమెరాల్లో బంధించిన ఫొటోను షేర్ చేశాడు. దీనికి ఈశ్వరా.. పరమేశ్వరా అనే యాష్ ట్యాగ్ పెట్టాడు.


ఈ ఫొటోను చూసిన జనాలు అబ్బురపడిపోతున్నారు. గరళాన్నే కంఠంలో దాచుకున్న ఆ పరమశివుడికి కరోనాను అంతం చేయడం పెద్ద కష్టం కాదని, ఆయన త్వరగా ఆ వ్యాధిని అంతం చేసి అందరినీ కాపాడతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం దేవుడిని పిలవగానే ప్రత్యక్షమైపోవడానికి ఇది సినిమా కాదు అంటూ వ్యంగ్యంగా సమాధానాలిస్తున్నారు.

ఇక టాలీవుడ్ స్టార్ కంపోజర్ గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు దేవి. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న పుష్ప చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇక ఉప్పెన చిత్రానికి గాను దేవిశ్రీ అందించిన మ్యూజిక్ యూత్ కి తెగనచ్చేసింది.