డాన్స్ మాస్టర్, నటుడు ‘ప్రభుదేవా’ (Prabhu Deva) తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ముసాషీ’(Musasi). ఈ మూవీకి సంబంధించిన ప్టస్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
డాన్స్ మాస్టర్ గా, నటుడిగా, దర్శకుడిగా తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితుడు ప్రభుదేవా. ఈయన సినిమాల కోసం అటు ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ ఏడాది తమిళంలో ప్రభుదేవా ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘ముసాషీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల నటనపైనే దృష్టి సారి స్తున్న ప్రభుదేవా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. నవ దర్శకుడు శ్యామ్ రోట్రిగ్స్ దర్శకత్వంలో జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాన్ బ్రిట్టో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో పోలీసు అధికారిగా నటిస్తున్నారు ప్రభుదేవా. జాన్ విజయ్, వీటీవీ గణేష్, జార్జ్ మరియాన్, మలయాళ నటుడు బినూపప్పు అరుళ్ దాస్, మాస్టర్ మహేంద్రన్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. దీనికి ఎస్‌ఎన్ ప్రసాద్ సంగీతాన్ని, విఘ్నేష్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ప్రభుదేవా మాస్ గెటప్‌తో కూడిన ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో ఎలాంటి హీరోయిన్ పాత్ర ఉండదంట. ఫుల్ మాస్ ఎలమెంట్స్ తెరకెక్కనుందంటూ సమాచారం.
తమిళంలో డ్యాన్సర్ గా, యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రభుదేవా ‘నువ్వొస్తానంటే నేను వద్దంటానా’ చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. సిద్దార్థ్ (Siddharth), (Trisha) త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో కొంతకాలం దర్శకుడిగా కొనసాగాడు ప్రభుదేవా. ప్రస్తుతం నటుడిగానే వరుస సినిమాలతో అలరించనున్నాడు.
