గ్యాప్ ఇవ్వకుండా రజనీకాంత్ వరస సినిమాలతో దూసుకుపోతున్నారు. నాలుగైదు నెలల గ్యాప్‌లోనే స్క్రీన్‌పై కనిపిస్తూ అభిమానులును అలరిస్తున్నారు. యంగ్ హీరోలు సైతం ఆయన స్పీడుకు షాక్ అవుతున్నారు.  ‘కాలా, 2.0, పేట్టా’ మూడు చిత్రాలు ఏడు నెలల గ్యాప్‌లో రిలీజ్ అయ్యాయి.  ఇక సంక్రాంతికి కొత్త సినిమా ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)తో బరిలోకి దిగుతున్నారు.

కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ హీరోగా రూపొందిన‌ పేటా చిత్రం జ‌నవ‌రి 10న‌ విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌లో ఇప్పటికే క్యూరియాసిటీని  క‌లిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ర‌జ‌నీకాంత్ 166 వ చిత్రం మురుగ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ని తెలుస్తుంది. 

ఈ నేపధ్యంలో మురగదాస్తో చేయబోయే సినిమా పూర్తి రాజకీయ చిత్రంగా ఉండబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాను రజనీతో చేయబోయే చిత్రం ఓ ఫాంటసీ సినిమా అని మురగదాస్ తేల్చేసారు.  పూర్తిస్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా, రజనీను ఆయన ఫ్యాన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉండబోతోందని ఆ మధ్య ఓ మీడియా ఇంట్రాక్షన్ లో  పేర్కొన్నారు మురగదాస్‌.

మురగదాస్ మాట్లాడుతూ... "నేను ఇప్పటికే రజనీని కలిసి ఓ కథను నేరేట్ చేసాను..ఆయనకు బాగా నచ్చింది.  అయితే నేను కంటిన్యూగా రాజకీయ చిత్రాలు చేయదలుచుకోలేదు. నా గత చిత్రాలు రాజకీయ  బ్యాక్ డ్రాప్ లో ఉన్నా డిఫరెంట్ స్టోరీ లైన్స్ తో ఉన్నాయి. అలాంటి సినిమాలే చేయాలంటే నాకు బోర్ వస్తుంది. అంతేకాదు నా సినిమాలు చూసే వారికి కూడా నాపై ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. కేవలం మురగదాస్ ..రాజకీయ చిత్రాలే చేయగలడు అని ఫిక్స్ అయ్యిపోతారు.  అందుకే రజనీకాంత్ కోసం నేను ఓ ఫాంటసీ కథను రాసాను. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వస్తుంది ," అని తేల్చి చెప్పేసాడు. 

లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. తొలిసారి ర‌జ‌నీకాంత్‌- మురుగదాస్ కాంబినేష‌న్‌లో ప్రాజెక్ట్ తెర‌కెక్కుతున్న నేప‌థ్యంలో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.