Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి అనే సీరియల్ మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వస్తుంది. దీంతో ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోతూ అందరినీ అలరిస్తుంది. ఇక ఈరోజు మార్చి 3 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

ఎపిసోడ్ ప్రారంభంలో పెద్ద అత్తయ్య తర్వాత నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఏసీపీ సర్ కి మాత్రమే, నేను చదువుకున్నాను.. ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు అంటుంది కృష్ణ. నేను కూడా చదువుకున్నాను కానీ ఇంత అహంకారం ప్రదర్శించలేదు అంటుంది ముకుంద. ఇంక ఆపండి ఇంత రభస అవసరమా అంటూ రేవతిని ఏమైనా అంటే తనే కాదు నేను కూడా ఊరుకోను అంటుంది భవాని.

పెద్దవాళ్లు ఒక మాట అంటే భరించలేవా అంటుంది భవాని. నేను తను ఏమీ అనాలనుకోలేదు అత్తయ్య కానీ తను రెచ్చగొట్టినట్లుగా మాట్లాడుతుంది అంటుంది కృష్ణ. నిజమే అక్క రేవతి అక్కని ఇప్పటివరకు ఎవరు ఏమీ అనలేదు. ముకుంద అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటుంది సుమ. నాకు భర్త ఉండి ఉంటే పెద్ద కోడలుగా హక్కు అధికారాలు ఉండి ఉండేవి, పెద్ద అత్తయ్య చెప్పారు ముకుంద ఇంటి పెద్ద కోడలు తను ఏం చెప్తే అది జరగాలి అని.

అయినా ఇప్పుడు నేను ఏమన్నాను లేట్ అయితే కృష్ణ ప్రాబ్లం అవుతుంది అన్నాను అంతే కదా అంటుంది ముకుంద. నేను ఏం తప్పు చేశానని ముకుంద నన్నే అని అందరూ నన్నే అంటారు అంటూ ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కృష్ణ. అప్పుడే అక్కడికి వస్తున్న మురారి తను ఎందుకలా ఏడుస్తూ వెళుతుంది ఏమైంది అని అడుగుతాడు. నన్ను అడుగు అంటుంది భవాని. కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంది కదా ఈరోజు చాలా లేట్ గా వచ్చింది.

ఆటోలో వెళ్లి రావడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ఉంది దాని గురించి కొంచెం ఆలోచించు అంటుంది భవాని. నాకు మాత్రం తను డాక్టర్ గా చూడాలని ఉండదా, నేనేదో తనని చదువు మానేయమన్నట్లుగా ఫీల్ అవుతుంది అంటుంది భవాని. మరో వైపు గదిలోకి వచ్చిన కృష్ణ వాళ్ళ మాటల్ని తలుచుకొని బాధపడుతుంటుంది. అందరికీ అలుసైపోయాను.

అందరూ నన్ను అనేవాళ్లే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క శివన్న ఉన్నాడు హాస్పిటల్ లో మా సీనియర్ ఇక్కడేమో పెద్ద అత్తయ్య నాకు గాని మండిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని తండ్రికి చెప్పుకుంటుంది కృష్ణ. అక్కడికి వచ్చిన మురారిని చూసి ఇంకా మీరు మిగిలిపోయారా ఏమంటారో అనండి అంటుంది కృష్ణ. ఏమైంది కృష్ణ కూల్ అవ్వు అంటాడు మురారి. మీరు నన్ను కూల్ అవ్వమంటున్నారు కానీ మీ వాళ్ళందరూ నన్ను కూలి అనుకుంటున్నారు.

కూర్చుంటే తప్పు నుంచి ఉంటే తప్పు లేటుగా వస్తే తప్పు ఏంటి కదా ఏంటి జీవితం. సుడిగాలిలో చిక్కుకున్న చిత్తుకాయితం అయిపోయింది నా బతుకు అంటుంది కృష్ణ. ఇప్పుడు ఏమైందని ఇంకా ఆపు అని గట్టిగా అరుస్తాడు మురారి. అన్నయ్య స్టార్ట్ చేశారన్నమాట చేయండి ఎంతసేపు తిడతారో తిట్టండి అంటూ ఆవేశంగా అరుస్తుంది కృష్ణ. ఆమె ఆవేశాలు చూసి ఏమీ అనలేక కూర్చుని పోతాడు మురారి.

ఎందుకు తిట్టడం లేదు దీన్ని తిట్టినా కూడా వేస్ట్ అనుకుంటున్నారా ఏంటి అంటూ మీది మీదికి వస్తుంది. ఏమీ చేయలేక ఆమె నోరు మూసేస్తాడు మురారి. నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు నువ్వు అంటాడు మురారి. మాట్లాడితే మాట్లాడుతారు కదా అందుకే అంటుంది కృష్ణ. అసలు ఏం జరిగిందని ఇంత ఆవేశంగా ఊగిపోతున్నావు అని మురారి అంటే ఇప్పుడు మళ్లీ మొత్తం కథ చెప్పాలా అంటూ నీరస పడిపోతుంది కృష్ణ. అయినా ఇదంతా మీ వల్లే అంటుంది. నేనేం చేశాను పని మురారి అంటే పొద్దున మీరు టైం కి డ్రాప్ చేసి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదు అంటుంది కృష్ణ.

నేను వచ్చే వరకు ఆగకుండా నువ్వే కదా వెళ్ళిపోయావు అంటాడు మురారి. నన్ను ఘోరంగా అవమానించి పంపించేశారు అంటుంది కృష్ణ. ఎవరు అంటాడు మురారి. ఇంకెవరు ముకుంద నేను టైం అయిపోతుంది అని మిమ్మల్ని గట్టిగా పిలుస్తుంటే, మురారి ఏమైనా క్యాబ్ డ్రైవరా అని రాడు పిలవకు అని నన్ను ఆపి క్యాబ్లో వెళ్ళిపోమని పంపించింది అంటుంది కృష్ణ. అప్పుడు పెద్దమ్మకి చెప్పలేదా అని మురారి అంటే ఆవిడ కూడా ఇంచుమించు అలాగే మాట్లాడారు.

తొందరగా రెడీ అవ్వాలట, తొందరగా రెడీ అవుదామంటే ఇంటి పని అంతా చేసి బయలుదేరాలి అంట హాస్పిటల్ లో ఆ గుమ్మడి పండు, నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ గోలపెడుతుంది. ఇదంతా నాకు తెలియదు అంటాడు మురారి. గౌతమ్ సార్ నుంచి ఫోన్ వచ్చింది నువ్వు వెళ్లిపోయావు అని ముకుంద చెప్పింది అంటాడు మురారి. నేను ఇదే విషయాన్ని మీకు మెసేజ్ కూడా పెట్టాను అంటుంది కృష్ణ.

అవునా అంటూ ఫోన్ చెక్ చేసి సారీ నేను మెసేజ్ చూసుకోలేదు అంటాడు మురారి. నీకు ఇకపై ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను అంటాడు మురారి. అమాయకురాలైనా ప్రశ్నని ముకుందా అలా వెళ్లగొడుతుందా అనుకుంటాడు మురారి. టెన్షన్ పడుతున్న రేవతి దగ్గరికి వచ్చి ఎందుకు అలాగా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఆమె భర్త. కరెక్ట్ టైం కి అడిగారు మీరే ఏదో ఒకటి చేయాలి, భవాని అక్క కృష్ణ ని అర్థం తీసుకోవటం లేదు, దానికి తోడు ముకుందా అగ్నికి రాజ్యం పోస్తుంది రోజు ఇలా పంచాయతీ అయితే ఆ పిల్ల తట్టుకోలేదు.

తను మురారిని నమ్ముకొని వచ్చింది రేవతి. మీ తోటి కోడళ్ళలో వదిన పెద్దది అందుకే మీరిద్దరూ ఆమెకి గౌరవం ఇస్తారు అలాగే ముకుంద కూడా ఈ ఇంటికి పెద్ద కోడలు అంటే వాళ్ళిద్దరికీ పోలిక పెట్టొద్దు గౌరవం అనేది ప్రవర్తనను బట్టి మనకి ఇవ్వాలి అనిపిస్తుంది. భవాని అక్క ఎప్పుడు మర్యాద ఇవ్వమని అడగదు తనని చూస్తేనే మనకే గౌరవం ఇవ్వాలి అనిపిస్తుంది. కానీ ముకుంద అలా కాదు గౌరవం కావాలి అని పడుతుంది కానీ కృష్ణ ఇవి అని పట్టించుకోదు ఇద్దరు కోడళ్ళ మధ్య భేదాలు వచ్చినప్పుడు కల్పించుకోకపోతే ఇంకా మనం పెద్దరికం ఎందుకు అంటుంది రేవతి.

ఏం చేయాలో మా వదినకి తెలుసు అంటే ఆదర్శ్ లేకపోవడం వల్ల ముకుంద మీద జాలి చూపిస్తుంది అంటుంది రేవతి. అంత మాత్రం చేత మా వదినకి తప్పు ఒప్పు తెలియదనుకోకు అంటాడు ఆమె భర్త. ఎంత తేలిగ్గా తీసి పారేశారు ఇంతకుముందు అంటే కోడలు లేరు కానీ ఇప్పుడు కోడలు వచ్చారు ఎవరు హద్దుల్లో నేర్పాలి. కృష్ణ తరుపున మనం మాట్లాడకపోతే ఇంకా గొడవలు పెరుగుతాయి అంటుంది రేవతి. ఆ మాటలకి ఆలోచనలో పడతాడు ఆమె భర్త. రోజుల తర్వాత మురారి నన్ను రమ్మంటే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ మురారి దగ్గరకు వస్తుంది.

నువ్వు నన్ను మాట్లాడాలని రమ్మన్నావా, నిజమేనా అంటూ ఎమోషనల్ అవుతుంది. అవును రమ్మన్నాను మాట్లాడాలి అంటాడు మురారి మన ప్రేమ గురించా అని ముకుందా అంటే కాదు నా భార్య గురించి అంటాడు మురారి. కృష్ణ నీ భార్యని తెలుసు ఎందుకు పదే పదే అలా అంటావు తను ఏమైనా విశ్వసుందర అంటుంది ముకుంద. మరి నువ్వేమైనా పైనుంచి ఇంటికి వచ్చావా మహా అయితే అప్పర్ మిడిల్ క్లాస్ మీది.

నువ్వు నా భార్య ని అందరి ముందు దారుణంగా అవమానించావు అంటాడు మురారి. తను నా గురించి ఏం చెప్పింది అని నిలదీస్తుంది ముకుంద తను ఏం చెప్పినా నిజమే చెప్తుంది అబద్ధం చెప్పడం రాదు అంటాడు మురారి. ఏం కల్పించి చెప్పిందో నాకు తెలియాలి అంటుంది ముకుంద. నా భార్యకి కల్పించి చెప్పే అలవాటు లేదు అంటాడు మురారి. నువ్వు పదే పదే నా భార్య నా భార్య అని ఎందుకు అంటున్నావు అంటుంది ముకుంద. నువ్వు గుర్తు పెట్టుకుంటావని అంటాడు మురారి.

అయితే ఏం చేయమంటావ్ తనకి సేవకురాలు లాగా సేవ చేయాలా అంటుంది ముకుంద. స్నేహితురాలిలాగా ట్రీట్ చేయాలి, ఒక మనిషిగా వెలువివ్వాలి ఆమె చదువుకున్న చదువుకి వాల్యూ ఇవ్వాలిఅంటాడు మురారి. అగ్రిమెంట్ పెళ్ళికి అంత విలువ ఇస్తున్నావా అంటుంది ముకుంద. నాకు అనవసరం తను అగ్రిమెంట్ పూర్తయి వెళ్లిపోయినా నాకు అనవసరం తను నన్ను నమ్మి ఈ ఇంట్లోకి వచ్చింది. ఈ ఇంట్లో నీడ దొరుకుతుంది అని వచ్చింది కానీ దానికి ఏమీ లేక రాలేదు. ఆమెకి తల్లిదండ్రులు లేరు కానీ తన పేరు మీద ఆమె తండ్రి చాలా ఆస్తులు ఇచ్చారు అంతకన్నా ముఖ్యమైన ఆస్తి చదువు ఉంది.

కోటీశ్వరులైనా చేతులెత్తి నమస్కరించే వైద్య వృత్తిలో ఉంది, ఏమి గతిలేక నా ఇంటికి రాలేదు ఈ విషయం చెబుదామని వచ్చాను అంటాడు మురారి. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు నువ్వు తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది ముకుంద. అయితే తప్పేముంది అంటాడు మురారి. ఎంతమందిని ప్రేమిస్తావుంటుంది ముకుంద. ప్రేమనేది ఉన్మాదం కాదు అదొక పవిత్రమైన బాధ్యత. ప్రేమంటే కోరుకోవటం కాదు ఇవ్వటం ఇస్తే తప్పేముంది అంటాడు మురారి. నువ్వు తెలివిగా నా జీవితంలో నుంచి తప్పుకోవాలని చూస్తున్నావ్ అంటుంది ముకుంద.

నువ్వు నన్ను నీ జీవితంలోకి లాక్కోవాలని చూస్తున్నావ్ అంటాడు మురారి. నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను నువ్వు ఎద్దేవా చేసిన పర్వాలేదు కానీ పురాణాల ప్రకారం పెళ్లయిన ప్రతి స్త్రీ భర్తని మాత్రమే ప్రేమించాలి పూజించాలి అని చెప్పే అక్షర సత్యాలు అంటాడు మురారి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.