Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో మంచి ట్విస్టులతో ముందుకి దూసుకుపోతుంది. అందర్నీ ఆకట్టుకుంటున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. ఇక ఈరోజు మార్చి 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ఇంటి కట్టుబాట్లు మన మంచి కోసమే అంటాడు మురారి. నేను మాట్లాడుతున్నది నా వ్యక్తిగత స్వాతంత్రం గురించి. మీరు నా చేతిని పట్టుకున్నారే అది నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మీ మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం ఆ ఒక్క నిమిషం తోనే పోయింది అంటుంది కృష్ణ. గౌరవం లేని చోట అగ్రిమెంట్ కి మాత్రం విలువేం ఉంటుంది అంటుంది.
నువ్వు ఎంత కాదన్నా బయటికి వెళ్తే నీకు శివన్న నుంచి రక్షణ లేదు అంటాడు మురారి. ఇక్కడ నీకు జరిగిన అవమానం ఏమీ లేదు నువ్వు దూరమైపోతున్నావు అనే బాధలో అలా చేశాను అంటాడు మురారి. మనం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా మరి కాపాడుకోవాలని ఆరాటం ఎందుకు అంటుంది కృష్ణ. మన మధ్యన అగ్రిమెంట్ తప్పితే ఏముంది అంటుంది. నిజమే మన మధ్య అగ్రిమెంట్ తప్పితే ఏముంది.
ఈ క్షణం వరకు మనం అపరిచితుల్లానే బ్రతికామెమో. ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకున్నాము ఒకరికి బాధనిపిస్తే మరొకరు బాధపడ్డాము అదంతా బ్రమేనేమో అయినా అతిథిగా వచ్చావు ఇక్కడ ఇమడలేక వెళ్ళిపోతున్నావు ఆపడానికి నేనెవరిని అంటూ ఎమోషనల్ అవుతాడు మురారి. మన మధ్య ఏమీ లేదు మీరు నిజమే చెప్పారు అంటూ కృష్ణ కూడా ఎమోషనల్ అవుతుంది.
ఇప్పుడు వెళ్లొచ్చా అని కృష్ణ అడిగితే నేను ఏమి కాని వాడిని కదా ఇప్పుడు నా అనుమతితో నీకేం పని అంటాడు మురారి. కృష్ణ తన సూట్ కేస్ తో బయలుదేరుతుంది. మురారి, రేవతి బ్రతిమాలుతున్నా వినిపించుకోదు. కిందికి వచ్చిన కృష్ణ తో డబ్బు ఏమైనా కావాలా అని అడుగుతుంది భవాని. బ్రతకడానికి నాకు వైద్య వృత్తి ఉంది అంటూ రేవతి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది కృష్ణ.
మిమ్మల్ని వదిలి వెళ్లాలంటే బాధగా ఉంది నా కోసం బెంగ పెట్టుకోవద్దు అంటూ ధైర్యం చెబుతుంది. భవాని దగ్గరికి వచ్చి అందరూ మీ కోపాన్ని చూస్తారు కానీ మీరంటూ లేకపోతే ఈ ఇల్లు ఎప్పుడో వేరు కాపురాలతో ముక్కలైపోయేది. ఒక్క నందిని విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మీరు ఒక గొప్ప స్త్రీ మూర్తి అంటూ ఆమె దగ్గర కూడా ఆశీర్వచనం తీసుకుంటుంది. సుమ బొట్టు పెట్టి చీర పెడుతుంది.
ఇల్లు వదిలి వెళ్లిపోయే కోడలికి చీర పెట్టే సాంప్రదాయం ఈ ఇంటికే చెల్లింది అంటూ సుమకి కూడా వీడ్కోలు చెబుతుంది కృష్ణ. నందిని విషయంలో పంతానికి పోయి కాపురాన్ని కూల్చుకుంటావా అంటుంది రేవతి.ఈ ఇంట్లో నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించి ఈ పోలీస్ ఆఫీసర్ తన బలాన్ని ప్రయోగించారు అంటుంది కృష్ణ. నువ్వు ఏ విషయాల
జోలికి వెళ్లకుండా ఉంటే ఈ సమస్య ఉండదు కదా అంటాడు మురారి.
మీరు కూడా సేఫ్ జోన్ క్రియేట్ చేసుకుంటున్నారా, ఇంట్లో ఒక సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారం కోసం నేను ప్రయత్నిస్తుంటే నన్ను వెళ్ళిపోమంటున్నారు. నందిని ఏమైపోయినా పర్వాలేదు అనే కదా మీ ఉద్దేశం. మీరు మీలాగా లేరు ఎసిపి సర్ అందుకే నేను నాలా ఉండదలుచుకున్నాను అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను ఉంటుంది కృష్ణ.
తనని ఎవరు ఆపటానికి వీల్లేదు హద్దులు దాటితే ఎవరైనా బయటికి వెళ్లాల్సిందే ఇది అత్తింటి బహిష్కారం అంటుంది భవాని. నందిని విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటాను అంటే ఉండనిస్తానని చెప్పాను కానీ తను వినటం లేదు అంటుంది భవాని. ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు అందరి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అంటాడు మురారి.
నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ వింటుంది ముకుంద. ఎంత పెద్ద ఆఫీసర్ ని అయినా భార్యకి భర్తనే నీకు ఆదర్స్ ఉండి ఉంటే భార్యాభర్తల బంధం గురించి తెలిసి ఉండేది అంటాడు మురారి. అంత పటిష్టమైన బంధమే అయితే ఎందుకు నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అంటుంది ముకుంద. నందిని విషయంలో తప్పు చేసింది కాబట్టి మొహం చెల్లక వెళ్ళిపోతుంది అంటుంది భవాని.
నేను ఏ తప్పు చేయలేదు, అలాగే ఇంట్లోంచి కూడా వెళ్ళను అంటుంది కృష్ణ. మళ్లీ ఇదేంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది భవాని. చేయని తప్పుని నెత్తి మీద వేసుకొని బయటికి వెళ్లలేను. నేను మంచిదాన్ని అని నిరూపించుకో అక్కర్లేదు కానీ నందినికి మంచి చేశాను అని నిరూపించుకోవాలి. అది రుజువు చేసే బయటికి వెళ్తాను అంటుంది కృష్ణ. ఆ మాటలకి సంతోషిస్తారు రేవతి, మురారి.
ముకుంద ఏదో మాట్లాడుతుంటే ఈ విషయం నాకు పెద్ద అత్తయ్య కి సంబంధించింది మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది కృష్ణ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణకి థాంక్స్ చెప్తాడు మురారి. మరోవైపు నందిని కి పదేపదే సిద్దు గుర్తొస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన కృష్ణ ఏమైంది అని అడుగుతుంది. సిద్దు ఎక్కడున్నాడో తెలుసు కానీ మంచోడు కాదు చెడ్డోడు అంటుంది నందిని.అది నీకు ఎలా తెలుసు అంటుంది కృష్ణ.
ఎలా అంటే అంటూ ఆలోచనలో పడుతుంది నందిని. కానీ ఏమీ గుర్తుకు రాకపోవడంతో తల పట్టుకుంటుంది. సిద్దు చాలా మంచోడు అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో తన బెడ్ తీసుకుని బయలుదేరుతున్న కృష్ణని ఎక్కడికి అని అడుగుతాడు నందిని దగ్గర పడుకుంటాను తను నా పేషెంట్ అంటుంది కృష్ణ. అమ్మకు తెలిస్తే బాధపడుతుంది అంటాడు మురారి.అంతవరకు వస్తే అత్తయ్యకి మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పేస్తాను అంటుంది కృష్ణ. మన బంధానికి ఎలాంటి విలువ లేదా అంటాడు మురారి.