బాహుబలి 2’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని... యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రద్ధాకపూర్‌ హీరోయిన్ గా  నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆగస్ట్ 15 న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా మెల్లిమెల్లిగా మెదలెట్టేసారు. ఇప్పటికే విడుదల చేసిన‘‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో’సోషల్ మీడియాలో సంచలనం గా మారి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేసింది. తాజాగా ఈ చిత్రంలో వాడిన ఓ కారు వీడియోని నటుడు మురళి శర్మ ట్వీట్ చేసారు. ఆ వీడియోని చూసిన వారికి సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ స్దాయిలో ఉండబోతున్నాయో మరో సారి అర్దమైంది. 

పూర్తిగా కారు ఛేజింగ్‌లు, ఫైట్లతో ‘సాహో’ సినిమాను భారీ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిస్తున్నారని ఈ వీడియోని బట్టి తెలుస్తోంది.  ‘సాహో’ సినిమా ఈ రోజు షూటింగ్‌ పూర్తయిందని మురళీ శర్మ ట్వీట్‌ చేస్తూ.. ఛేజ్‌ సన్నివేశాన్ని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరినట్లు తెలిపారు. ముంబయిలోని ఆంబే వ్యాలీలో  జరిగిన ఈ షూటింగ్‌  పూర్తిగా తుక్కు తుక్కైన  కారును తరలిస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేశారు. ఛేజింగ్‌ కోసం ఉపయోగించడం వల్ల ఆ కారు అలా అలా అయ్యిపోయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన యాక్షన్ సినిమాల అభిమానులు తమకు ఈ ఓ ట్రీట్‌ కాబోతోందని భావిస్తున్నారు. 

ఈ  చిత్రంలో  నీల్‌ నితిన్‌ ముకేష్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆగస్టు 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.