Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవి మనసుని బాధపెట్టారు..ఆ నిర్ణయం తీసుకుని కూడా డ్రాప్ అయింది అందుకే, మురళి మోహన్ వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులంతా చిరంజీవి సినీ కెరీర్ ని, ఆయన చారిటి కార్యక్రమాలని గుర్తు చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Murali Mohan Sensational comments on Megastar Chiranjeevi dtr
Author
First Published Aug 22, 2024, 4:26 PM IST | Last Updated Aug 22, 2024, 4:26 PM IST

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులంతా చిరంజీవి సినీ కెరీర్ ని, ఆయన చారిటి కార్యక్రమాలని గుర్తు చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవితో సన్నిహితంగా ఉండే సీనియర్ నటుల్లో మురళి మోహన్ ఒకరు. 

మురళి మోహన్ మెగా ఫ్యామిలీ అందరితో చాలా క్లోజ్ గా ఉంటారు. పలు సందర్భాల్లో మురళి మోహన్ చిరంజీవిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలకి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మురళి మోహన్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు, రామానాయుడు లాంటి వారంతా దూరం అయ్యాక ఇండస్ట్రీకి పెద్ద అంటూ ఎవరూ లేరు. 

ఒకసారి మేమంతా చిరంజీవి దగ్గరికి వెళ్లి ఈ మాట చెప్పాం. ఇండస్ట్రీలో అసోసియేషన్స్ మధ్య గొడవలు జరిగినా.. ఏదైనా వివాదాలు జరిగినా వాళ్లంతా ఎవరికి వెళ్లి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇండస్ట్రీకి ఒక పెద్ద అంటూ ఉంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్టీఆర్ తర్వాత అంత ఊపు వచ్చింది మీకే. కాబట్టి మీరే ఇండస్ట్రీ పెద్దగా ఉండండి అని అడిగాం. 

మొదట చిరంజీవి గారు అందుకు ఒప్పుకోలేదు. మేమంతా బలవంతం చేసే సరికి ఒకే అన్నారు. ఇక ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవిని అనౌన్స్ చేద్దాం అని అనుకున్నాం ఇంతలో ఒక సంఘటన జరిగింది. చిరంజీవి గారిని ఎవరో బాధ పెట్టారు. ఆ వ్యక్తి ఎవరో మురళి మోహన్ పేరు చెప్పలేదు. ఆ సంఘటనతో చిరంజీవి మనస్తాపానికి గురయ్యారు. 

మరుసటి రోజే చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. ఇండస్ట్రీ బిడ్డగా ఉంటాను. ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా మీ బిడ్డగా నా సాయం నేను చేస్తాను అని చెప్పేశారు. చిరంజీవి ఆలా ఎందుకు చెప్పారో అని ఆరా తీస్తే ఆయన్ని ఎవరో బాధపెట్టారు అని అర్థం అయినట్లు మురళి మోహన్ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios