సౌత్ ఇండియాలో ఎన్నో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న మురుగదాస్ ఫైనల్ గా తన డ్రీమ్ హీరో రజినీకాంత్ తో భారీ సినిమాను తెరకెక్కించడానికి సిద్దమయ్యాడు. 2.0 సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ మురగదాస్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిందట. దీంతో దర్శకుడికి బడ్జెట్ లిమిట్స్ పెద్దగా లేకపోవడంతో ఎవరు ఊహించని విధంగా సినిమాను ప్రజెంట్ చేయడానికి సిద్దమవుతున్నాడు. 

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ సెట్టయ్యాడు. ముందుగా లైకా రెహమాన్ ని అలాగే ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ తో సంప్రదింపులు జరుపగా మురుగదాస్ ఏరికోరి అనిరుధ్ ని ఎంచుకున్నాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన కత్తి సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ కోసం మరోసారి ఇద్దరు రెడీ అయ్యారు.

అనిరుథ్ ఆల్ రెడీ రజినీకాంత్ పెట్టా సినిమాకు పనిచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన రెండు సాంగ్స్ కి రెస్పాన్స్ కూడా అదిరిపోవడంతో రజినీకాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. మురగదాస్ సినిమాలో రజినీకాంత్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్కార్ సినిమాతో తమిళ రాజకీయాలను కదిలించిన ఈ దర్శకుడు మరోసారి ఒక ఊపు ఉపేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.