స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం దుల్కర్ ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు.
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి ముంబై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం దుల్కర్ ని విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అంతలా దుల్కర్ ఏం చేశాడని అనుకుంటున్నారా..? కార్ స్టీరింగ్ గాలికొదిలేసి మొబైల్ ఫోన్ లో ఏదో చూసుకుంటున్నారు.
ఈ వీడియోని నటి సోనమ్ కపూర్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. ముంబై పోలీసులు వెంటనే స్పందించి ఇలాంటి పనులు మానుకోవాలని మీ ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి వార్నింగ్ ఇచ్చారు. చాలా మంది నెటిజన్లు కూడా దుల్కర్ పై మండిపడ్డారు. ఇలాంటి పోజులు సినిమాల్లో చూపించుకో రోడ్ మీద కాదు అంటూ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
వెంటనే స్పందించిన దుల్కర్ అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటపెట్టారు. ఆ కారును తాను డ్రైవ్ చేయడం లేదని, ఓ భారీ ట్రక్కు తన కారుని లాగుతోందని క్లారిటీ ఇచ్చాడు. 'ది జోయా ఫ్యాక్టర్' సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు తెలిపాడు. ఆ సమయంలో తనకు అసలు కారు మీద కంట్రోల్ లేదని, కారు స్టార్ట్ కూడా చేయలేదని చెప్పాడు.
ఆ సమయంలో డ్రైవింగ్ సీట్ లో కూర్చొని మొబైల్ చెక్ చేసుకుంటుంటే సోనమ్ ఆ వీడియో తీసిందని వెల్లడించాడు. ఇదే విషయాన్ని సోనమ్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఆ వీడియోని రోడ్డు భద్రతలో భాగంగా పోస్ట్ చేసినట్లు, ఈ విషయంలో ముంబై పోలీసులు బాగా స్పందించారని, అందరూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోస్ట్ పెట్టింది.
