Asianet News TeluguAsianet News Telugu

అమితాబచ్చన్, అనుష్క శర్మలకు ఫైన్ వేసిన ముంబయ్ పోలీసులు, ఎంత ఫైన్ వేశారంటే..?

అమితాబ్ , అనుష్క శర్మలకు షాక్ ఇచ్చారు ముంబయ్ పోలీసులు.. గత కొన్ని రోజులుగా వీరిపై హెల్మెంట్ వివాదం నడుస్తోంది. ఈ విషయంలో అమితాబ్ వివరణ కూడా ఇచ్చురు. అయినా సరే చేసిన తప్పుకు  యాక్షన్ తప్పదంటున్నారు ముంబయ్ ట్రాఫిక్ పోలీస్. 

Mumbai Police Fined Amitabh Bachchan And Anushka Sharma JMS
Author
First Published May 18, 2023, 2:18 PM IST

 సినిమా సెలబ్రిటీలు ఏం చేసినా.. జనాలు గమినస్తుంటారు. స్టార్ కాబట్టి తమ అభిమాన నటీనటులు చేసే పనులకు సంతోషపడతారు కాని.. అలా చేసే క్రమంలో వారు రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం.. అది పెద్ద వివాదమే అంతుంది. సామాన్యులను అయినా వదిలిపెడతారేమో కాని.. సెలబ్రిటీలకు మరో ఛాన్స్ ఉండదు.  ఇప్పుడు అమితాబ్, అనుష్క శర్మ విషయంలోనూ అదే జరిగింది. తాజాగా ఓ షూటింగ్ కి లేట్ అవుతుందని, కారులో నుంచి దిగి బైక్ పై లిఫ్ట్ అడిగి అమితాబ్ లొకేషన్ కి చేరుకున్నారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేశారు. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. 

మరో సందర్భంలో.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ  అనుష్క శర్మ కూడా ఇలానే హెల్మెట్ లేకుండా జర్నీ చేసింది. ఆమె కూడా బైక్ పై వెనకాల కూర్చుని వెళ్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చి.. సోషల్ మీడియాలో శేర్ చేసింది. దాంతో వీరిద్దరిపై పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. రెండు సందర్భాల్లోనూ అదీ కూడా అమితాబ్, అనుష్క శర్మ లాంటి స్టార్స్ నిబంధనలు అతిక్రమించే సరికి పాజిటీవ్ గా స్పందించే నెటిజన్లుే హ్యాపీ పీల్ అవుతూ.. కామెంట్లు పెట్టారు. కాని కొంత మంది నెటిజన్లు మాత్రం ఈవిషయంలో అసలు విషయాన్ని గట్టిగా పట్టుకుని... ముంబయి పోలీసులని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

 

దీంతో పోలీసులు.. సదరు స్టార్ యాక్టర్స్ అయిన అమితాబ్, అనుష్కలపైన గరం అయ్యారు. ఇద్దరు స్టార్లపై  సీరియస్ అయ్యారు. నెటిజన్ల ప్రశ్నలకు బదులిస్తూ.. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  అనుకున్నట్టుగానే ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అమితాబ్ కి రూ.1000, అనుష్కకి రూ.10500 జరిమానా వేసినట్లు, ఆ ఫైన్స్ ని కూడా వారు చెల్లించేసినట్లు రసీదులు చూపిస్తూ ట్వీట్ చేశారు. అయితే అనుష్కకు 10500 రూపాయిలు జరిమానా ఎందుకు వేసారో అని అందరు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

అయితే అంతకు ముందే ఈ విషయంలో వివరణ ఇచ్చారు అమితాబ్.  షూటింగ్‌కు లేటవుతుందనే కారణంతో అపరిచితుడి బైక్‌పై ప్రయాణం చేశానన్నారు బిగ్ బీ... ఈ విషయంలో విమర్షలపై  అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడుతూ…ఆదివారం కాబట్టి రోడ్డుపై రద్దీ ఉండదని ముంబైలోని బల్లార్డ్‌ వీధిలో మా సినిమా షూటింగ్‌ ఏర్పాట్లు చేశారు. అక్కడికి కొద్ది దూరంలోనే మా కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దాంతో లొకేషన్‌కు ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లాను. ఒక వీధిలో నుంచి మరో వీధిలోకి మాత్రమే బైక్‌పై ప్రయాణించా. అది ప్రధాన రహదారి కాదు. నడుస్తూ వెళ్తే సెక్యూరిటీ సమస్య వస్తుందని భావించా అని వివరణ ఇచ్చారు అమితాబ్. 

Follow Us:
Download App:
  • android
  • ios