Asianet News TeluguAsianet News Telugu

షారూఖ్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కి మరోసారి షాక్‌.. బెయిల్‌ తిరస్కరణ

ఇప్పటికే ఓసారి ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ కోసం కోర్ట్ ని ఆశ్రయించారు. కానీ కోర్ట్ అనుమతివ్వలేదు. పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో మరోసారి బెయిల్‌ కోసం ఆయన తరపున న్యాయవాది కోర్ట్ లో పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు కోర్ట్ నిరాకరించింది.

mumbai court shock to aaryan khan refused bail petition
Author
Hyderabad, First Published Oct 8, 2021, 5:33 PM IST

డ్రగ్స్ కేసులో ఊచలు లెక్కబెడుతున్నాడు బాలీవుడ్‌ అగ్ర హీరో షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌. రేవ్ పార్టీలో ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలో ముంబయి పోలీసులు ఐదు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ని ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్యన్‌ ఖాన్‌ తన బెయిల్‌ కోసం ముంబయి హైకోర్ట్ ని ఆశ్రయించారు. దీంతో శుక్రవారం ఈ బెయిల్‌ పిటిషన్‌ విచారించిన ముంబయి కోర్ట్ పిటిషన్‌ని తిరస్కరించింది. 

ఇప్పటికే ఓసారి aaryan khan బెయిల్‌ పిటిషన్‌ కోసం కోర్ట్ ని ఆశ్రయించారు. కానీ కోర్ట్ అనుమతివ్వలేదు. పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో మరోసారి bail కోసం ఆయన తరపున న్యాయవాది mumbai courtలో పిటిషన్‌ దాఖలు చేయగా, అందుకు కోర్ట్ నిరాకరించింది. దీంతో మరోసారి ఆర్యన్‌ ఖాన్‌కి నిరాశే ఎదురయ్యింది. మరోవైపు  బెయిల్‌ కోసం సుప్రీంకోర్ట్ ని సైతం ఆశ్రయించారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్యన్‌ ఖాన్‌ 14 రోజులు జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆయనతోపాటు పట్టుబడ్డ మరో ఏడుగురు నిందితులు కూడా కస్టడీలో ఉన్నారు. 

related news:ముంబై డ్రగ్స్ కేసు: ఆర్యన్‌ఖాన్‌కు కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ... 14 రోజుల రిమాండ్

ముంబయి అరేబియా సముద్రంలో క్రూయిజ్‌ షిప్‌లో రేవ్‌ పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై సోమవారం ఆర్యన్‌ ఖాన్‌తోపాటు మరో ఏడుగురుని ముంబయి పోలీస్‌లు అరెస్ట్ చేసిన విసయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఎన్సీబీ అధికారుల కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ని కోర్ట్ లో హాజరుపరిచారు ఎన్సీబీ అధికారులు. 

మరోవైపు ఆర్యన్‌ ఖాన్‌ ఫోన్‌లో కీలకమైన సమాచారం ఉందని ఎన్సీబీ అధికారులు కోర్ట్ ముందు వెల్లడించారు. ఆర్యన్‌ నుంచి కొకైన్‌ కూడా సీజ్‌ చేసినట్టు కోర్ట్ కి తెలిపారు. ఇంకా ఆయన్నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, తమ కస్టడీకి అప్పగించాలని అధికారులు కోర్ట్ ని కోరడంతో అందుకు కోర్ట్ అనుమతించింది. దీంతో ప్రస్తుతం జ్యూడీషియన్‌ కస్టడీని ఎదుర్కొంటున్నాడు ఆర్యన్‌ ఖాన్‌.

Follow Us:
Download App:
  • android
  • ios