Asianet News TeluguAsianet News Telugu

ముమైత్ ఖాన్ నోటికి ప్లాస్టర్.. బిగ్ బాస్ కెప్టెన్ ఆశలు ఆవిరి

  • బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్ నోటికి ప్లాస్టర్
  • తెలుగులో మాట్లాడాలనే నిబంధన పాటించట్లేదని శిక్ష
  • కెప్టెన్ అవుదామనుకున్న ముమైత్ ఆశలకు గండి కొట్టిన సభ్యులు
MUMAITH KHAN MOUTH PLASTERED FOR NOT SPEAKING TELUGU

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న స్టార్ మా ఛానెల్ ‘బిగ్ బాస్’ షోలో ముమైత్ ఖాన్ కు నిన్న ఊహించని షాక్ తగిలింది. తెలుగు మాట్లాడలేదు అనే కారణంగా బిగ్ బాస్ ముమైత్ కు నోటికి ప్లాస్టర్ అంటించే తన శిక్షను ప్రిన్స్ ద్వారా అములు చేసాడు. దీనికితోడు తాను వచ్చే వారం షోకు క్యాప్టెన్ అవుతానని ముమైత్ ఎంత ముచ్చట పడినా ‘బిగ్ బాస్’ ఇంటి సభ్యులలో చాలామంది ఆమెకు ఓటు వేయకపోవడంతో ముమైత్ తీవ్ర నిరాశకు లోనై కంట కన్నీరు పెట్టుకుంది. 

 

ఇక బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన ప్రిన్స్ స్విమ్మింగ్ పూల్‌ లో 50 సార్లు మునక వేయాలి. మునక వేసిన ప్రతీసారి కెమెరా ముందుకు వచ్చి ‘ఇక నుంచి అందరం తెలుగులోనే మాట్లాడుతాం. మమ్మల్ని క్షమించండి' అంటూ 50 సార్లు చెప్పాలి అనే శిక్ష‌ను కూడ ‘బిగ్‌బాస్’ విధించారు. 

 

ఇక అత్యధికంగా ఓట్లు వచ్చిన ఆదర్శ్‌ను కెప్టెన్‌గా నియమించారు బిగ్‌ బాస్. దాంతో సభ్యులందరూ ఆదర్శ్‌కు అభినందనలు తెలిపారు. తాను ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నాను. హౌస్ నుంచి బయటకు వెళ్లే లోపు ఒక్కసారి కెప్టెన్‌గా వ్యవహరించాలని ఉంది అంటు ముమైత్ అనేక సార్లు ప్రాధేయపడినా ముమైత్ ఎంతగానో అభిమానించే ధన్ రాజ్ కూడ ముమైత్ కు ఓటు వేయకపోవడం షాకింగ్ గా మారింది. బిగ్‌ బాస్‌ షోలోజరిగిన అన్ని విషయాలను వెల్లడిస్తూ ఒక పుస్తకం వ్రాస్తానని కత్తి మహేష్ ప్రకటించాడు. అయితే.. దానికి ధన్ రాజ్ కూడ పోటీగా మరో పుస్తకాన్ని వ్రాస్తాను అంటూ షాకిచ్చాడు.

 

వీకెండ్ రావటంతో మళ్ళీ ఈరోజు నుంచి ఈషోలో జూనియర్ హంగామా మొదలుకాబోతున్న నేపధ్యంలో జూనియర్ అభిమానులు ఈరోజు రేపు ప్రసారం అయ్యే ఈషో ఎపిసోడ్స్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు..   

Follow Us:
Download App:
  • android
  • ios