Krishna Mukunda Murari: బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకొని మంచి రేటింగ్ తో ముందుకి దూసుకుపోతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ కృష్ణ ముకుంద మురారి. ఇక ఈ రోజు ఫిబ్రవరి 28 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

ఎపిసోడ్ ప్రారంభంలో హాస్పిటల్ కి వచ్చినా గౌతమ్ తన క్యాబిన్ లో కూర్చొని ఎవరిదో ఫోటో చూస్తూ ఆలోచనలో ఉంటాడు అంతలోనే అక్కడికి వచ్చిన మరో డాక్టర్ రిపోర్ట్స్ ఇస్తాడు. అవి చూసినా కూడా పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఫోటోని చూస్తూ ఉంటాడు గౌతమ్. నువ్వు ఇంకా తనని మర్చిపోలేదా తనకి ఇప్పటికే పెళ్లి అయిపోయి ఉంటుంది అంటాడు ఆ డాక్టర్. ఆ మాటలకి అతన్ని కోపంగా చూస్తాడు గౌతమ్.

అర్థం చేసుకున్న ఆ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే అక్కడికి వచ్చిన కృష్ణ, గౌతమ్ గారి క్యాబిన్ ఎక్కడ అని అడుగుతుంది. మీరు ఎవరు అని అడిగితే కొత్తగా హౌస్ సర్జన్ చేయటానికి వచ్చాను గౌతమ్ గారి టీం అంటుంది కృష్ణ. మీ గురించి మేడమ్ చెప్పారు నా పేరు భాను నేను కూడా గౌతమ్ టీమే అంటాడు. నా పేరు కృష్ణవేణి అంటూ తనని తాను పరిచయం చేసుకుంటుంది. లోపలికి వెళ్ళబోతున్న కృష్ణను కాపీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తాడు భాను. లోపలికి వచ్చిన కృష్ణ రూమ్ అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనిస్తుంది.

నా పేరు కృష్ణవేణి పరిచయం చేసుకొని నేను హౌస్ సర్జన్ చేయటానికి డాక్టర్ పరిమళ గారు మీ మీ సూపర్విజన్లో వర్క్ చేయమన్నారు అంటుంది. వార్డులో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు లేడీస్ ఎంతమంది జెంట్స్ ఎంతమంది అంటూ గలగల మాట్లాడేస్తుంది కృష్ణ. జనాభా లెక్కలు రాయడానికి వచ్చావా అంటాడు గౌతమ్. ఆ మాటకి కామ్ అయిపోతుంది కృష్ణ. అయినా ఫస్ట్ డే నే ఇంత లేటుగా రావడం ఏంటి అంటాడు గౌతమ్. అదే మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటూ నోరు జారుతుంది కృష్ణ.

వాట్ అంటూ కోప్పడతాడు గౌతమ్. అంటే నేను వచ్చి చాలా సేపు అయింది మీకు మూడుసార్లు మీ గురించి అడిగితే రాలేదని చెప్పారు అంటుంది కృష్ణ. రెండు ఫైల్స్ ఆమె ముందు పెట్టి నేను రౌండ్స్ కి వెళ్లి వచ్చేసరికి వీటిని రిపేర్ చేయి, నేను వచ్చి అడిగితే వెంటనే ఆన్సర్ చేయాలి అంటాడు గౌతమ్. అంత తక్కువ టైంలో ఒక్క ఫైల్ చదవడం కూడా చాలా కష్టం ఉంటుంది కృష్ణ. ఇంకొక మాట మాట్లాడితే మూడో ఫైల్ కూడా ఇస్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్.

ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళు తగులుతున్నారేంటి, దీంతో పోలిస్తే పర్మల మేడం ఎంత సాఫ్ట్ గా అనుకుంటూ ఫైల్ రిఫర్ చేస్తుంది. ఇంతకీ ఈ డాక్టర్ పేషెంట్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాడో తెలుసుకోవాలి అంటూ వార్డు వైపు వెళ్తుంది కృష్ణ. మరోవైపు క్రిటికల్ గా ఉన్న కేసుని డీజీపీ గారు మనకే అసైన్ చేశారు. ఎలాంటి అవసరం వచ్చిన ఆఖరికి పర్సనల్ కాల్స్ కూడా అటెండ్ చేయకూడదు అంటాడు.

అంతలోనే ముకుందా ఫోన్ చేయడంతో మరీ అర్జెంట్ అయితే ఒక్క కాల్ అటెండ్ చేయొచ్చు అంటూ రూల్స్ మారుస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను బయట ఉన్నాను బయటికి రా అంటుంది ముకుంద మీటింగ్ లో ఉన్నాను బయటికి రాలేను అంటాడు మురారి. మళ్లీ ముకుందా ఫోన్ చేయడంతో పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు పర్సనల్ కాల్ అయి ఉంటుంది లిఫ్ట్ చేయండి అంటాడు కానిస్టేబుల్. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నువ్వు బయటకు వస్తావా నన్ను బయటికి రమ్మంటావా అంటూ డిమాండింగ్గా మాట్లాడుతుంది ముకుంద.

నేనే వస్తాను అంటూ బయటికి వస్తాడు మురారి. బయటికి వచ్చిన మురారిని ఎందుకు చిరాగ్గా ఉన్నావు అని అడుగుతుంది ముకుందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు బిజీగా ఉన్నాన్నేను అంటాడు మురారి. కంగారు పడకు నేను భోజనాన్ని మాత్రమే తీసుకొచ్చాను అంటుంది ముకుంద నువ్వు దయచేసి క్యారేజ్ తీసుకురావద్దు. క్యారేజీలు తీసుకురావడానికి మాకు గవర్నమెంట్ స్టాఫ్ ని అరేంజ్ చేసింది అంటాడు మురారి.

ఏం నేను తీసుకురాకూడదా అని ముకుందా అంటే ఒకసారి తీసుకువచ్చి వెంకటేష్ అంకుల్ దగ్గర బుక్ చేశావు కదా సంక్రాంతి రోజు నరకం అనుభవించాను అంటాడు మురారి. కృష్ణ వెళ్లిపోయేదాకా ఆగాలంటే నా వల్ల కావడం లేదు అంటుంది ముకుంద కృష్ణ వెళ్ళిపోతుంది అని మాటిమాటికీ అనొద్దు అంటాడు మురారి నేనేమీ పంపించలేదు కదా నువ్వే చెప్పావు కదా అంటుంది ముకుందా ఈ విషయాన్ని నేను ఎప్పుడో వదిలేసాను నువ్వు కూడా వదిలేయ్ అంటాడు మురారి.

తనేమి మన ఇంట్లో శాశ్వతంగా ఉండు దానికి రాలేదు కదా అని ముకుంద అంటే ఆ మాటలకి ఇరిటేట్ అయినా మురారి ఆమెని బయలుదేరమంటాడు నేను బయలుదేరుతాను కానీ వెళ్ళే ముందు ఒక మాట అంటూ ఎలాగూ మీది అగ్రిమెంట్ మ్యారేజే కదా ఈ లోపుగా ఆమెకి స్టెతస్కోపులు యూనిఫారాలు గిఫ్ట్ ఇచ్చి ఆమెకి ఎందుకులేని పోనీ ఆశలు రేపుతున్నావు. నువ్వు ఇలా గిఫ్ట్ ఇచ్చుకుంటూ పోతే తను నీ మంచితనానికి జరిగిపోయి ఇక్కడే ఉండిపోతుంది అనుకుంటున్నావా అసలు ఏంటి నీ ఉద్దేశం అంటూ నిలదీస్తోంది ముకుంద.

ఆదర్శ్ రాకపోతే బాగుంటుందనుకుంటున్నావా, కృష్ణ వెళ్లిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా వాళ్ళిద్దరూ ఎవరు మటుకు వాళ్ళు వెళ్ళిపోతే మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నావా ఏంటి నీ ఉద్దేశం అంటూ నిలదీస్తాడు మురారి. నాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పాను కానీ నా హృదయంలో ఖాళీ ఉందని కానీ మరొకరికి స్థానాన్ని ఇస్తానని కానీ నేను చెప్పలేదు. కృష్ణకి నేను స్నేహితుడిగా శ్రేయోభిలాషిగా భర్తగా ఉంటాను అని చెప్తాడు మురారి. నేను నిన్ను ఇప్పటికీ ఆదర్శ్ భార్యగానే చూస్తున్నాను. నేను ఆ జన్మ బ్రహ్మచారిగానైనా ఉంటాను తప్ప నా ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేయను.

ఒకవేళ కృష్ణ నన్ను ప్రేమిస్తే ఏమో నేను కూడా తిరిగి ప్రేమిస్తానేమో అంటూ తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్తాడు మురారి. నువ్వు కూడా ప్రేమిస్తావా ఏ మనసుతో ప్రేమిస్తావు నన్ను ప్రేమించిన మనసుతోనేనా, ఆ మనసు నుంచి నేను చచ్చిన తప్పుకోను, మన ప్రేమ శాశ్వతం పర్మినెంట్గా మన మధ్య ఉంటుంది అంటుంది ముకుంద. ఆదర్శ్ వచ్చినా కూడా నేను నిన్నే ప్రేమిస్తాను ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముకుంద. మరోవైపు వార్డులో గౌతమ్ ట్రీట్మెంట్ చేసే విధానాన్ని దొంగ చాటుగా చూస్తూ నవ్వుకుంటుంది కృష్ణ.

చూడ్డానికి గుమ్మడి పండు లాగా ఉన్న ఈ డాక్టర్ గారి గుండె జాలిగుండే అనుకుంటుంది. అంతలోనే గౌతమ్, కృష్ణని చూసేస్తాడు. అది గమనించిన కృష్ణ కంగారుగా అక్కడి నుంచిక్యాబిన్ కి . అస్తవ్యస్తంగా ఉన్న ఆ రూమ్ ని సర్దుతుంది. ఆ సర్దడంలో భాగంగా ఫోటోని కూడా సర్దుబోతుంది కృష్ణ. అంతలో గౌతమ్ రావడంతో చూడకుండానే ఆ ఫోటో పెట్టేస్తుంది లోపలికి వచ్చిన గౌతమ్ తన రూమ్ నీట్ గా ఉండడానికి చూసి ఇది నా కాబిన్ కాదేమో అనుకొని వెళ్ళిపోబోతాడు.

సర్ ఇది మీ క్యాబినె అంటూ కంగారుగా అతన్ని పిలుస్తుంది కృష్ణ. ఏంటి ఇదంతా అని గౌతమ్ అంటే నేనే నీటుగా సర్దేను అంటుంది కృష్ణ నువ్వు హౌస్ చేయటానికి వచ్చావా హౌస్ కీపింగ్ చేయడానికి వచ్చావా అంటాడు గౌతమ్. నాకు ఎంత ప్రెజెంట్ గా ఉంటే నచ్చదు నా రూము ఇంతకుముందు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే పెట్టు అంటాడు గౌతమ్. నాకు సర్దుకు మాత్రమే వచ్చు చెడగొట్టడం రాదు అంటుంది కృష్ణ. చెయ్యాలి అంటూ ఆర్డర్ వేస్తాడు గౌతమ్. చచ్చినట్లు అలాగే చేస్తుంది కృష్ణ. చూడండి రూముని ఎంత ఛండాలంగా చేసానో మీ టేస్ట్ కి తగ్గట్టుగానే ఉంది కదా అంటుంది కృష్ణ. మళ్లీ తనే ఆ ఫోటో ఎవరిది అని అడుగుతుంది తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.