Asianet News TeluguAsianet News Telugu

Krishna Mukundha Murari: నిజాన్ని రుజువులతో సహా బయటపెట్టిన ముకుంద.. గౌతమ్ ని నమ్మి మోసపోయానంటున్న కృష్ణ!

Krishna Mukundha Murari: స్టార్ మాలో ప్రసారమవుతున్న కృష్ణా ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాలని దోచుకుంటుంది. అనుకోని పరిస్థితులలో పెళ్లి అయిన ఇద్దరి వ్యక్తుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చ్ 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Mukunda accuses Krishna and Gautham for Nandhini's critical condition in todays Krishna Mukundha Murari serial gnr
Author
First Published Mar 18, 2023, 12:55 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో నందు కోసం కన్నీరు పెట్టుకుంటాడు గౌతమ్. అంతలోనే కృష్ణ రావటంతో మీ వాళ్ళు ఏమైనా గొడవ చేసారా అని అడుగుతాడు. అవును అంటుంది కృష్ణ. అంతా సర్దుకుంటుంది కానీ నీ ప్రయత్నం మాత్రం మానొద్దు నందుని నువ్వే కాపాడగలవు. వాళ్లు ఏం చేస్తున్నారన్నది ఓ కంట  కనిపెట్టు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంటే నందు, సిద్దు అని కలవరిస్తుంది.

నందుని చూస్తాడు కానీ ఏమీ చేయలేక బయటకు వచ్చేస్తాడు గౌతమ్. బయటికి వచ్చిన గౌతమ్ షి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కాసేపట్లో తనని తీసుకెళ్లిపోవచ్చు అని  చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మెడిసిన్ ఈ హాస్పిటల్లో ఇచ్చినవే కదా, ఎందుకిలా అయింది అని నిలదీస్తుంది భవాని. నాకు అర్జెంట్ కేసు వచ్చింది అంటూ అక్కడినుంచి తప్పించుకుంటాడు గౌతమ్.

మరోవైపు భవాని తనకి గన్ గురిపెట్టిన సంగతి తలుచుకుని టెన్షన్ పడతాడు గౌతమ్. నువ్వు ఇన్నాళ్లు నన్ను మర్చిపోయావు అనుకొని ప్రపంచం మీద కసితో బ్రతికాను. నీ ఆరోగ్యాన్ని పరువు కోసం పణంగా పెడుతున్నారు అంటే వాళ్లు ఎంత ప్రమాదకరమైన మనుషులో అర్థమవుతుంది నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే నిన్ను చంపటానికి భయపడరు, నా తల్లిదండ్రులని చంపడానికి కూడా భయపడరు అనుకుంటాడు.

నా మూలంగా  కృష్ణ వాళ్లతో ఎన్ని మాటలు పడుతుందో ఏంటో అనుకుంటూ ఆమె మీద జాలి పడుతాడు గౌతమ్. మరోవైపు నందిని కి ఇంజక్షన్ చేయడానికి వెళుతున్న కృష్ణని ఆపి ఇంజక్షన్ ఎందుకు మరింత సీరియస్ అవ్వడానికా అంటుంది భవాని. ఇది మా సీనియర్ డాక్టర్ రాసిచ్చింది అంటుంది కృష్ణ సీనియర్ డాక్టర్ ఇచ్చారని చెప్పి ఆ టాబ్లెట్ కూడా వేసావు ఇలా అయింది అంటూ మందలిస్తుంది భవాని.

టాబ్లెట్ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది అంటుంది కృష్ణ. ఈ ఇంజక్షన్ విషయంలో మాత్రం పొరపాటు జరగదని గ్యారెంటీ ఏంటి అంటుంది భవాని. కృష్ణ జరిగింది చాలు వెళ్లి నీ పని చూసుకో అంటూ కోడల్ని మందలిస్తుంది రేవతి. ఇదే మాట నీ కోడలికి నువ్వు ముందే చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు అని భార్యని మందలిస్తాడు ఈశ్వర్.

నందిని కి నేను శత్రువుని కాదు ఎందుకు నన్ను నమ్మటం లేదు అంటుంది కృష్ణ. చేసుకోవద్దు అంటున్నా వినకుండా ఎంత దూరం తీసుకొచ్చావు అంటూ మందలిస్తాడు ప్రసాద్. కృష్ణని మరీ అంత తీసిపారేయకండి తనకి ఆ మాత్రం తెలియకుండానే టాబ్లెట్స్ ఇస్తుందా అంటూ భార్యని వెనకేసుకొస్తాడు మురారి. అంతలోనే అక్కడికి వచ్చిన ముకుంద నీకు కావాల్సింది ఆధారాలే కదా అంటూ కృష్ణ కావాలనే ఈ మందులు నందిని వేసింది అంటుంది.

మందులు గురించి నీకేం తెలుసు అంటుంది కృష్ణ. ఇంటర్నెట్ కి తెలుసు నువ్వు మురారి ఆధారాలు అడుగుతున్నారు కదా నువ్వే చూడు అంటూ ఫోన్ కృష్ణకి ఇస్తుంది. ఫోన్ చూసిన కృష్ణ కంగారు పడుతుంది. ఈ టాబ్లెట్ వేసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని బ్రెయిన్ మీద చెడు ప్రభావం పడొచ్చని రాసి ఉంది అంటుంది ముకుంద. అవునా అని కృష్ణుని నిలదీస్తుంది భవాని. అవును అంటుంది కృష్ణ.

 మీరిద్దరూ మొన్న టాబ్లెట్స్ రాసిన సీనియర్ డాక్టర్ని జైలుకు పంపిస్తాను అన్నారు కదా, పంపించాల్సింది ఆ డాక్టర్ని కాదు  ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఇచ్చారు కదా ఈ డాక్టర్ని అంటుంది ముకుంద. నీ వచ్చిరానీ వైద్యంతో  నా కూతుర్ని బలి చేద్దాం అనుకుంటున్నావా అంటుంది భవాని. అంత మాట అనకండి నేను నందు ని పసిపాప లాగా చూసుకుంటున్నాను అంటుంది కృష్ణ.

ఇదంతా మురారి ఇచ్చిన అలుసు కాకపోతే తను ఇంత ధైర్యం ఎందుకు చేస్తుంది అంటాడు ప్రసాద్. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది పాత టాబ్లెట్స్ మాన్పించి పట్టుబట్టి మరి ఈ టాబ్లెట్స్ వేయించింది అంటూ రెచ్చ కొట్టినట్లుగా మాట్లాడుతుంది  ముకుంద. ఇప్పుడే విషయం తేల్చేస్తాను అంటూ కృష్ణ, గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. లోడ్ స్పీకర్ ఆన్ చెయ్యు నీ సీనియర్ ఏం మాట్లాడుతారో అందరూ వింటారు అంటుంది ముకుంద.

గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫోను లిఫ్ట్ చేయలేదా అంటుంది భవాని. చెయ్యరు అత్తయ్య తను ఒక డాక్టర్ అని చెప్పి నందిని ప్రాణాలతో చెలగాటమాడింది అంటుంది ముకుంద. దీనికి శిక్ష పడాల్సిందే కదా అంటుంది భవాని. నేను కావాలని తప్పు చేయలేదు అంటుంది కృష్ణ. నీకు కావాల్సింది ఆధారాలు కదా ఎందుకు ఈ భార్యని వెనకేసుకొస్తావు అని మురారిని అడుగుతుంది ముకుంద. నేను ఏం తప్పు చేశాను,ఇన్ని రోజులు నందిని ఎలా చూసుకున్నానో మీరందరూ చూడలేదా.

నందిని మామూలు మనిషిని చేయాలని నేను పడిన ఆరాటం మీరు గమనించలేదా ఏం మాట్లాడుతున్నారు మీరంతా, టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మధ్యలో ఆయన ఏం చేశారు ఆయనకి నందిని అంటే ఇష్టం లేదా, ప్రతిసారి గమనిస్తున్నాను నన్నే టార్గెట్ చేస్తున్నారు. నా భర్త నన్ను డ్రాప్ చేస్తే డ్రైవరా అని అడిగింది నా డబ్బులతో కారు కొనుక్కునే స్తోమత  ఉంది అత్తింటి గౌరవం కాపాడటం కోసం ఆటోలోని, క్యాబ్లోని తిరుగుతున్నాను.

అలాగే ఈ టాబ్లెట్లు విషయంలో కూడా నేను ఏ తప్పు చేయలేదు ఇది నా సీనియర్ ఇచ్చిన టాబ్లెట్స్ అలా ఎందుకు ఇచ్చారో కనుక్కునేదాకా నేను నిద్రపోను. ఒకవేళ నిజంగానే ఆయనది తప్పు ఉంటే ఆ సీనియర్ తో పాటు ఈ సీనియర్ మీద కూడా కేసు పెడతాను చాలా అంటూ ఎమోషనల్ అవుతుంది కృష్ణ. మాట్లాడటం అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా, ఇంతకుముందు ఎవరు నా ముందు ఇలా మాట్లాడలేదు ఇన్ని ప్రశ్నలు సంధిచలేదు.

ఇంతగా నా పెద్దరికం ఎవరైనా నిలదీశారా, ఇన్నోళ్లు మురారి మొహం చూసి వదిలిపెట్టాను. నా కూతురి ప్రాణాలు మీదికి వచ్చిన తర్వాత ఎవరినైనా సరే నేను వదలను అంటుంది భవాని. నావల్ల తప్పు జరిగింది నిజమే కానీ అది నేను కావాలని చేసింది కాదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ. మీ పెద్దరికంకి అడ్డు రావటం లేదు, ఇంతమంది ముందు నన్ను దోషి లాగా నిలబెడితే నేను తట్టుకోలేకపోయాను అంతే.

 మీరు ఏ శిక్ష వేస్తారో వేయండి అంటుంది కృష్ణ. ఈ ఇంటికి నీవల్ల ద్రోహం ద్రోహం జరిగింది అందుకు ఈ ఇంటి నుండి నిన్ను శాశ్వతంగా పరిష్కరిస్తున్నాను అంటుంది భవాని. మరి అలాంటి శిక్ష అంటూ అందరూ కంగారు పడతారు. కృష్ణకి మీతో ఎలా మాట్లాడాలో తెలియక అలా మాట్లాడింది అందుకని మన ఇంటి కాడల్ని మనమే వెళ్ళగొడతామా అంటుంది  సుమ. ఇంత పెద్ద శిక్షా అంటూ కంగారుపడుతుంది రేవతి.

 ఇది నా ఉనికికి, నా అస్తిత్వానికి జరిగిన అవమానం. ఎన్నో సంవత్సరాల నుంచి నిలబెట్టుకొస్తున్న పెద్దరికాన్ని ఈ పిల్ల ప్రశ్నించింది నా మాటని ఖాతర చేయని మనుషులు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే పెట్టే బేడ సర్దుకుని వెళ్ళు అంటుంది భవాని. భార్యని వెనకేసుకొస్తాడు మురారి నువ్వు కూడా వెళ్తావా అంటూ మురారిని మందలిస్తుంది భవాని. మీరు జోక్యం చేసుకోవద్దు ఏసీపి సర్ నావల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేనే వెళ్ళిపోతాను అంటుంది కృష్ణ.

నేను మాట్లాడుతున్నాను కదా అంటూ కోప్పడతాడు మురారి. వెళ్తానంటుంది కదా వెళ్ళనివ్వు అంటుంది భవాని.  కానీ ఇప్పుడు కాదు, ఇలా కాదు. ఈ నెంబర్ నితిన్ వేసుకుని ఒక దోషి లాగా ఈ ఇంట్లోంచి వెళ్ళను. ఇప్పుడు వెళ్ళిపోతే నిజంగానే మీ అందరి దృష్టిలోని దోషినవుతాను. నేను నిర్దోషిని అని నిరూపించుకున్నాక ఇంట్లోంచి వెళ్తాను నాకు రెండు రోజులు టైం ఇవ్వండి. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని అప్పుడు వెళ్తాను అంటుంది కృష్ణ. అప్పుడైనా ఇదే జరుగుతుంది అంటుంది భవాని.

టాబ్లెట్ ఇచ్చింది వాళ్ళ సీనియర్ తొందరపడి మనం కృష్ణ మీద నింద వేయకూడదు తను అడిగినట్లు టైం ఇద్దాం  అంటూ భార్యని వెనకేసుకొస్తాడు మురారి. తరువాయి భాగంలో నందు దగ్గరికి వచ్చిన ముకుందని సిద్దు వెళ్లిపోయాడా తనని పంపించేశారా అని అడుగుతుంది నందు. సిద్దు ఎవరు అని భవానీని నిలదీస్తుంది ముకుంద. గౌతమ్ సర్ ని ఎంతో నమ్మాను ఇప్పుడు ఆయన ఫోన్ కూడా తీయడం లేదు అని భర్తతో చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది కృష్ణ.

Follow Us:
Download App:
  • android
  • ios