మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.
మరికొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. దీనితో ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా అదిరిపోయింది.
విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య రొమాన్స్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ విషయంలో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. తెలుగులో మృణాల్ ఠాకూర్ కి ఇది మూడవ చిత్రం. సీతారామం, హాయ్ నాన్న తర్వాత మృణాల్ నటిస్తున్న మూవీ ఇదే.

తన మూడవ చిత్రానికే మృణాల్ ఠాకూర్ సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తోంది అంటూ ఇటీవల చిత్ర యూనిట్ లీకులు ఇచ్చింది. డైరెక్టర్ పరశురామ్ దగ్గరుండి ఆమె చేత జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పిస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ అవన్నీ జరగలేదు అని తేల్చేసింది. మృణాల్ ఠాకూర్ ఒరిజినల్ వాయిస్ ని స్క్రీన్ పై వినాలనుకునే ఫ్యాన్స్ కి ఇది నిరాశే.
ముందుగా తాను ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పాలని ప్లాన్ చేసుకుందట. కానీ షూటింగ్ ఆలస్యంగా ముగిసింది. వెంటనే ప్రమోషన్స్ మొదలయ్యాయి. తొలిసారి డబ్బింగ్ చెప్పాలంటే కాస్త టైం ఎక్కువ కావాలి. రిలీజ్ డేట్ కూడా దగ్గర్లోనే ఉంది. అందువల్లే తాను డబ్బింగ్ చెప్పడం కుదర్లేదు అని మృణాల్ ఠాకూర్ అంటోంది.
