చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో కాస్టింగ్ అమాంతం పెరిగిపోతుంది. హీరోయిన్లు యాడ్ అవుతున్నారు. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్లతో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో చిరంజీవి ఒక వీరుడి పాత్రని పోషిస్తున్నట్టు తెలుస్తుంది. `బింబిసార` ఫేమ్ వశిష్ట ఈ మూవీని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షాకింగ్ విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో కాస్టింగ్ రోజు రోజుకి మరింతగా పెరిగిపోతుంది.
`విశ్వంభర`లో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెతోపాటు మరో ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారట. అందులో ముగ్గురు సిస్టర్స్ రోల్స్ అని తెలుస్తుంది. అందుకోసం ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి ఎంపికయ్యారట. ఆల్‌రెడీ వీళ్లపై షూటింగ్ జరుగుతుందట. ఆదివారం నుంచే ఈ చిత్రీకరణ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.
వీరితోపాటు మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నారట. అందులో మృణాల్ ఠాకూర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆమెతోపాటు మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే వీరిది గెస్ట్ రోల్స్ అని టాక్. కొమియో పాత్రల్లో ఈ ఇద్దరు భామలు కనిపిస్తారట. వీరితోపాటు రాజ్ తరుణ్, నవీన్ చంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలా భారీ కాస్టింగ్ యాడ్ అవుతూ సినిమా స్థాయిని పెంచేస్తున్నారు చిరు, వశిష్ట.
ఈ సినిమా బడ్జెట్ సైతం భారీగా పెరుగుతుందట. చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నారట. యూవీ క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. వీఎఫ్‌ఎక్స్, భారీ కాస్టింగ్ ఉన్న నేపథ్యంలో సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు దాటుతుందని తెలుస్తుంది. ఇది మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధికమని చెప్పొచ్చు, ఇంకా చెప్పాలంటే డబుల్ అని చెప్పొచ్చు. చిరంజీవి నటించిన `వాల్తేర్ వీరయ్య`, `భోళాశంకర్`, `గాడ్ ఫాదర్`, `సైరా` చిత్రాలు 100-120కోట్లు దాటలేదు. ఇప్పుడు చాలా పెరిగిపోతుంది.
మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కంటెంట్ పరంగా సినిమా భారీ బడ్జెట్‌ని కోరుకుంటుంది, పెట్టడంలో తప్పులేదు, కానీ మార్కెట్ లెక్కలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయనేది సస్పెన్స్ గా మారింది. మేకర్స్ చాలా సాహసం చేస్తున్నారనే చెప్పాలి. ఇది మెగాస్టార్ మార్కెట్‌కి, ఇమేజ్‌కి పరీక్షలాంటి చిత్రమే అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.