ప్రేమ కథలు ఎన్ని తీసినా కూడా ఈ రోజుల్లో ఫాలో అయ్యేది ఒకటే ఫార్ములా అనేది అందరికి తెలిసిందే. ఎక్కువగా ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ అనేది అందరూ ఫాలో అయ్యేది. అయితే దాన్ని తాయారు చేసే విధానం డిఫరెంట్ గా ఉండే ఆడియెన్స్ కో కొత్త టెస్ట్ ను అనుభవించిన భావన కలుగుతుంది. అయితే దర్శకుడు వెంకీ అట్లూరి మిస్టర్ మజ్ను సినిమా విషయంలో తొలిప్రేమ రొట్టెను తిప్పేశాడు అనే టాక్ వస్తోంది. 

తొలిప్రేమ లో హీరో హీరోయిన్ చిన్న మనస్పర్థలతో విడిపోతారు. అతనిని మళ్ళి హీరోయిన్ కలవాలని అనుకోవడం. ఓ సెకండ్ హాఫ్ సీన్స్ లో అయితే హీరోయిన్ హీరో ఒక్కటవుతున్న సమయంలో వరుణ్ చెప్పేమాటలకు హీరోయిన్ హార్టవ్వడం.. అనంతరం హీరో ఫీల్ అవ్వడం.ఈ సీన్స్ అన్ని వెంకీ అట్లూరి తొలిప్రేమలో తెరపై బ్యూటిఫుల్ గా చూపించాడు. 

అయితే ఇప్పుడు మిస్టర్ మజ్ను విషయంలో మనోడు కథను తిప్పేశాడు. హీరో పాత్రను కాస్త మార్చేసి హీరోయిన్ ను రెగ్యులర్ గానే చూపించాడు. తొలిప్రేమ దర్శకుడు కాబట్టి సేమ్ టచ్ ఉండడం కామన్ కానీ అదే తరహాలో రొట్టెను తిప్పేసినట్లు మిస్టర్ మజ్ను లో కూడా హీరో మాటలకు ఒక సీన్ లో లవ్ చేసిన హీరోయిన్ హార్టవ్వడం మనస్పర్థలతో అదే పనిగా హీరో ఫీల్ అవ్వడం ఇక క్లైమాక్స్ లో ఎమోషన్స్ అన్ని ఇంతకుముందు చాలా సినిమాల్లో చూసినట్లు అనిపిస్తుంది. మెయిన్ గా తొలిప్రేమలో హీరోయిన్ ఎక్కువగా హీరోకు దగ్గరవ్వాలని చూస్తుంది. ఈ సినిమాలో అఖిల్ పాత్ర హీరోయిన్ కోసం తాపత్రయపడుతుంది.

కథ రొటీన్ గా ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో యువ దర్శకులు మేకింగ్ స్టైల్ ను ని మార్చేసి ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. తొలిప్రేమ కథ వచ్చి రెండేళ్లు కూడా కాలేదు అప్పుడే దర్శకుడు మళ్ళీ అదే ఫార్మాట్ లో వెళితే ఆడియెన్స్ కి కొత్త టెస్ట్ ను ఫీల్ అయ్యే భావన ఎలా కలుగుతుంది.. సో మిస్టర్ మజ్ను అఖిల్ స్థాయికి తగ్గటు లేదని సినీ విమర్శకుల నుంచి టాక్ వస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.