Asianet News TeluguAsianet News Telugu

#MrKing:మహేష్ బాబు తో రిలేషనా? ఎవరీ శరణ్ కుమార్?

పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ – అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కిన విజయనిర్మల కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. వాళ్ళ మనవడు శరణ్   కుమార్ హీరోగా  పరిచయం అవుతున్నారు.

Mr King...who is WHO IS SHARAN KUMAR ?
Author
First Published Sep 18, 2022, 5:28 PM IST

గత కొద్ది రోజులుగా సినిమావాళ్లలో చర్చగా నిలవటమే కాకుండా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన చిత్రం మిస్టర్ కింగ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, పాట, టీజర్ రిలీజ్ అయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయి. మిస్టర్ కింగ్  సినిమా టీజర్ ను కేవలం వారం రోజుల్లో  40 లక్షల మంది వీక్షించారు.  అంతకు ముందు వినని సినిమా ఒక్క సారిగా బజ్ తెచ్చుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో  ...ఈ సినిమా హీరోగా చేసిన  శరణ్ కుమార్  ఎవరు,కొత్తవాడైనా మంచి ఈజ్ తో చేసాడని సర్వత్రా వినపడుతోంది. ఈ క్రమంలో ఈ విషయం తెలియచేయటానికి టీమ్ ఓ వీడియో వదిలింది. 

సూపర్ స్టార్ కృష్ణగారు ఈ వీడియోలో చరణ్ తమ కుటుంబానికి చెందిన విషయం రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియచేసారు. అలాగే సహజనటి జయసుధగారు, సీనియర్ నటుడు నరేష్ గారు, హీరో సుధీర్ బాబు ..సినిమా విజయం సాధించాలని విషెష్ తెలిపారు. ఇక ఈ చిత్రం ద్వార కృష్ణ గారి కుటుంబం నుండి 8 వ హీరో గ పరిచయమవుతున్నారు శరణ్ కుమార్. 

చిత్ర హీరో శరణ్ మాట్లాడుతూ... తను హీరో అవటానికి మహేష్ బాబుగారు ప్రేరణ అని చెప్పారు. నటుడుగా నిలదొక్కాలంటే  స్ట్రగుల్ ఉండాలని, అప్పుడే అది ఆర్ట్ ఫామ్ లో కనిపిస్తుందని నమ్ముతానని, ఆ స్ట్రగుల్ తాను పడ్డానని శరణ్ కుమార్  అన్నారు.ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇందులో నా పాత్ర పేరు శివ‌. యూత్ కు బాగా క‌నెక్ట్ అవుతుందని న‌మ్ముతున్నా. మ‌ణిశ‌ర్మ‌గారు చ‌క్క‌టి బాణీలు స‌మ‌కూర్చార‌ని తెలిపారు.

‘హూ ఈస్ శరన్ కుమార్’ అనే వీడియోను  సూపర్ కృష్ణ మరియు మహేష్ బాబు ఫాన్స్ ఘనంగా రిలీజ్ చేశారు. నానక్ రామ్ గూడా లోని హీరో శరణ్ కుమార్ నివాసం వద్ద  గెట్ టు దెగర్ కార్యక్రమంలో వారంతా  కలిసారు. జిల్లాల వారిగా వచ్చిన అభిమానులకు ...  శరణ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు . పలు విషయాలు చర్చించారు. సూపర్ స్టార్ తో తమ అనుభంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ కుటుంబం వస్తున్న మరో హీరోకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం మొత్తం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

ఈ కార్యక్రమంలో   హీరో తండ్రి రాజ్ కుమార్, డైరెక్టర్, శశిధర్ చావలి, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవికిరణ్ చావలి పాల్గొన్నారు. అలాగే కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ జాతీయ అధ్యక్ష్యుడు మహ్మద్ ఖాదర్ ఘోరి,  దొడ్డి రాంబాబు, జంగయ్య గౌడ్ ఇంకా మిగతా అభిమానులు పాల్గొన్నారు.
 
 ఈ మిస్టర్ కింగ్  చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ ప‌తాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్  అందిస్తున్నారు.  

న‌టీన‌టులుః
శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, SS కంచి, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు

సాంకేతిక సిబ్బందిః
నిర్మాణం: హన్విక క్రియేషన్స్, ప్రెజెంట్స్: బేబీ హన్విక ప్రెజెంట్స్, 
నిర్మాత: బి.ఎన్.రావు, 
కథ & దర్శకత్వం: శశిధర్ చావలి, 
సంగీత దర్శకుడు: మణిశర్మ, 
సినిమాటోగ్రాఫర్: తన్వీర్ అంజుమ్, 
సాహిత్యం: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, కడలి, 
సహ నిర్మాత: రవికిరణ్ చావలి, 
కొరియోగ్రాఫర్: భూపతి రాజా,
పబ్లిసిటీ డిజైనర్: శివం సి కబిలన్, 
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్,
కాస్ట్యూమ్ డిజైనర్: కావ్య కాంతామణి & రాజశ్రీ రామినేని

Follow Us:
Download App:
  • android
  • ios