లేటెస్ట్ రిలీజ్ ది వారియర్ మూవీ విషయంలో దేవిశ్రీ అబాసుపాలయ్యారు. ఒకటి రెండు సాంగ్స్ పర్లేదు అనిపించుకున్న దేవిశ్రీ బీజీఎమ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే మాట గట్టిగా వినిపిస్తుంది.
సంగీత దర్శకుడిగా రెండు దశబ్దాల ప్రయాణంలో దేవిశ్రీ అనేక బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ కారణంగా హిట్టైన సినిమాలు అనేకం. అలాంటి దేవిశ్రీ కొన్నాళ్లుగా ఫార్మ్ కోల్పోయి బాధపడుతున్నారు. ఆయన నంబర్ వన్ రేసులో వెనుకబడ్డారు. దేవిశ్రీని వెనక్కి నెట్టి థమన్ ముందుకెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ చలామణి అవుతున్నారు. టాప్ స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ ఆయన వెనకబడుతున్నారు. దర్శకుడు కొరటాల, త్రివిక్రమ్, బోయపాటి వంటి డైరెక్టర్స్ దేవీశ్రీని వదిలేశారు.
ఆచార్య వరకు కొరటాల, అజ్ఞాతవాసి వరకు త్రివిక్రమ్ తమ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీని తీసుకునేవారు. 2020 సంక్రాంతి కానుకగా అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు విడుదలయ్యాయి. అల్లు అర్జున్ సినిమాకు థమన్ ఇచ్చిన సాంగ్స్ మహేష్ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన సాంగ్స్ డామినేట్ చేశాయి. హిట్ పరంగా కూడా అల వైకుంఠపురంలో చిత్రమిదే పై చేయి. ఆ మూవీ విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి.
ఇదిలా ఉండగా లేటెస్ట్ రిలీజ్ ది వారియర్(The Warriorr) మూవీ విషయంలో దేవిశ్రీ అబాసుపాలయ్యారు. ఒకటి రెండు సాంగ్స్ పర్లేదు అనిపించుకున్న దేవిశ్రీ బీజీఎమ్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే మాట గట్టిగా వినిపిస్తుంది. ది వారియర్ నెగిటివ్ టాక్ తెచ్చకోవడంలో దేవిశ్రీ మ్యూజిక్ కూడా ఒకటి. సోషల్ మీడియా వేదికగా దేవిశ్రీని ఆడియన్స్ ఏకిపారేస్తున్నారు. ఇంత చెత్త బీజీఎమ్ జీవితంలో చూడలేదని కామెంట్స్ చేస్తున్నారు.
ది వారియర్ మూవీ దేవిశ్రీ(Devisri Prasad) ఇమేజ్ బాగా దెబ్బతీసిందని చెప్పాలి. క్రిటిక్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు దేవిశ్రీ మ్యూజిక్ దారుణమని తేల్చేశారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో దేవిశ్రీ విమర్శలపాలు కాలేదు. మరోవైపు దేవిశ్రీ అభిమానులు ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నారు. సినిమాలో విషయం లేకపోతే దేవిశ్రీ ఏం చేస్తాడు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మరోవైపు పుష్ప సాంగ్స్ యూట్యూబ్ లో భారీ రికార్డు నమోదు చేయడం విశేషం. ఈ మూవీ సాంగ్స్ 500 కోట్ల వ్యూస్ తో సరికొత్త రికార్డు నమోదు చేశాయి. పుష్ప పార్ట్ 2 కి కూడా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.
