నాలుగు కోట్ల విలువైన లగ్జరీ కారును ఎలుకలు పాడు చేయడంతో ఆ హీరో లబో దిబో అంటున్నాడు. ఇంతకీ ఆ అన్ లక్కీ హీరో ఎవరో చూద్దాం...  

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టిన కార్తీక్ ఆర్యన్ ఓ స్థాయికి ఎదిగాడు. ప్యార్ కా పంచనామా 2, సోనూ కే టిటు కీ స్వీటీ, లూకా చుప్పి, పతీ పత్ని ఔర్ ఓ వంటి చిత్రాలతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. 2022లో ఆయన నటించిన భూల్ బులియా 2 బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఆ ఏడాది విడుదలైన భారీ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ఒక్క భూల్ బులియా 2 మాత్రమే భారీ విజయం సాధించింది. 

అనీష్ బాజ్మీ ఈ చిత్ర దర్శకుడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా టబు కీలక రోల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ నేపథ్యంలో నిర్మాత భూషణ్ కుమార్ హీరో కార్తీక్ ఆర్యన్ కి రూ. 4.72 కోట్ల విలువైన మెక్ లారెన్ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారును వాడకుండా గ్యారేజ్ లో ఉంచిన కార్తీక్ ఆర్యన్ కి షాక్ తగిలింది. కారును ఎలుకలు పాడు చేశాయట. కారులోని మ్యాట్స్ ని ఎలుకలు కొరికి నాశనం చేశాయట. 

కోట్ల ఖరీదైన కారు కావడంతో ఆ మ్యాట్స్ ఖర్చే లక్షల్లో అయ్యిందట. ఈసారి ఎలుకలు పాడు చేయకుండా భద్రమైన ప్రదేశంలో ఆ కారును ఉంచాడట. కాగా కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ విడుదలకు సిద్ధం అయ్యింది. భారత్ కు పారా ఒలింపిక్స్ లో మెడల్ అందించిన మురళీ కాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది.